HomeజాతీయంRaghav Chadha joins BJP backlash: బీజేపీలో చేరిన రాఘవ్‌ చద్దాకు గట్టి షాక్‌

Raghav Chadha joins BJP backlash: బీజేపీలో చేరిన రాఘవ్‌ చద్దాకు గట్టి షాక్‌

Raghav Chadha joins BJP backlash: ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపికైన యువ నేత రాఘవ్‌ చద్దా. ఇటీవల పార్లమెంటులో సామాన్యుల తరఫున అనేక ప్రశ్నలు వేసి సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యారు. ఆయన వేసిన ప్రశ్నలు సామాన్యులను సైతం ఆకట్టుకున్నాయి. దీంతో సోషల్‌ మీడియాలో ఆయనకు ఫాలోయింగ్‌ భారీగా పెరిగింది. అయితే ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆయనను పార్టమెంటరీ పార్టీ ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించారు. దీంతో రాఘవ్‌ చద్దాపై సానుభూతి మరింత పెరిగింది. కానీ ఇంతలోనే ఆయన తీసుకున్న ఓ నిర్ణయం నెటిజన్లను, ఆయన ఫాలోవర్లను షాక్‌కు గురిచేసింది. దీంతో గంటల వ్యవధిలోనే 10 లక్షల మంది నెటిజన్లు ఆయనను అన్‌ ఫాలో చేశారు.

ప్రశ్నలతో ఫాలోవర్ల పెంచుకుంటూ…
రాఘవ్‌ చద్దా ఆప్‌ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. అయితే ఇటీవల పార్లమెంటులో వేసిన ప్రశ్నలు ఆయనను సామాన్యుల ప్రతినిధిగా నిలిపాయి. దీంతో రాఘవ్‌కు సోషల్‌ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్‌ పెరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనకు 14.6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా యాన బీజేపీలో చేచడంతో ఇన్‌స్టా ఫాలోవర్లు 14.6 మిలియన్‌ నుంచి దాదాపు 13.7 మిలియన్‌కి దిగజారారు. 24 గంటల్లోనే సుమారు 10 లక్షల మంది అన్‌ఫాలో చేశారు.

ప్రజల గొంతు నుంచి పార్టీ మార్పు..
ఇటీవలి కాలంలో రాఘవ్‌ చడ్ఢాను ప్రజా సమస్యలపై గట్టిగా మాట్లాడే భవిష్యత్‌ నాయకుడిగా చాలామంది చూస్తున్నారు. అయితే సడెన్‌గా ఆయన ఆప్‌ నుంచి నేరుగా బీజేపీలో చేరడం చాలామందికి అప్రయోజనమైన నిర్ణయంగా భావిస్తున్నారు. ఇన్‌స్టా కామెంట్లో్ల సాధారణంగా వినిపిస్తున్న వాదం ఏమిటంటే ‘‘ప్రజా సమస్యల కోసం గళమెత్తే నాయకుడని భావించాం, కానీ ఇప్పుడు మాకు కూడా అందరిలాగే ఉన్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం రాఘవ్‌పై వ్యక్తిగత ఆగ్రహం కాకుండా, ఆప్‌ ఇమేజ్‌పై కొంత నిరాశ, అంతే కాదు రాజకీయాల్లో లాయల్టీ, స్థిరత్వం ప్రశ్నార్థకం చేస్తుంది.

సోషల్‌ మీడియా ప్రభావం..
ఇప్పటి కాలంలో ఇన్‌స్టా, ఎక్స్‌ వంటి ప్లాట్‌ఫామ్‌లు నాయకుల ఫ్యాన్‌ బేస్‌ను మాత్రమే కాకుండా వారి రాజకీయ ప్రభావాన్ని కూడా కొలవగల డిజిటల్‌ స్కోర్‌ బోర్డ్‌లా మారిపోయాయి. రాఘవ్‌ ఫాలోవర్‌ డ్రాప్, కామెంట్లో్ల హేతువాద వాదనలు, మెమ్స్‌ అన్నీ కలిసి చూస్తే సోషల్‌ మీడియా ప్రజలు తమ విశ్వాసం తీసేసి, ‘‘అన్‌సబ్‌స్క్రైబ్‌ / అన్‌ఫాలో’’ ద్వారా జరిమానా విధిస్తున్నారు అనే స్పష్టమైన సంకేతమే కనిపిస్తోంది.

ఈ సోషల్‌ మీడియా బ్యాక్‌లాష్‌ కేవలం చిన్న బాధ కాదు. రాఘవ్‌ చడ్ఢా బీజేపీలో ఎంత వేగంగా స్థిరపడతారు, ప్రజా సమస్యల ఇమేజ్‌ను ఇంకా ఎంతవరకు కాపాడగలుగుతారు అనే దానిపై ప్రభావం చూపే సంకేతంగా కూడా ఉపయోగించుకోవచ్చు. పార్టీ మార్పులు చేసే నాయకులు ఇప్పుడు కేవలం వోట్‌ బ్యాంకులు కాకుండా డిజిటల్‌ ఫ్యాన్‌ బేస్‌ను కూడా లెక్క చేయాల్సిన కాలం వచ్చింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular