Ragging: ఒకరినొకరు చెప్పులతో కొట్టుకోవడం.. బెడ్ పై ఉండే పిల్లోలతో సెక్స్ చేయమనడం.. అమ్మాయిలపై రాష్ గా ప్రవర్తించడం.. ఇవన్నీ వినడానికే అసహ్యంగా ఉంటుంది. కానీ భావి భారత పౌరులుగా ఎదిగే కొందరు విద్యార్థులు మరికొందరు విద్యార్థులతో చేయిస్తున్నారు. సీనియర్లుగా తాము కూడా ఇలా చేశామంటూ జూనియర్లపై ర్యాగింగ్ చేస్తున్నారు. తమ జీవితాన్ని చక్కదిద్దుకొని భవిష్యత్ కు బాటలు వేద్దామని వెళ్తున్న వారిని వికృత చేష్టలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఓ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులకు విచారణ చేపట్టడంతో దారుణ విషయాలు బయటికి వచ్చాయి. మధ్యప్రదేశ్ లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జరుగుతున్న ర్యాగింగ్ తతంగం కలకలం రేపుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

మధ్యప్రదేశ్ లోని ప్రభుత్వం వైద్య కళాశాల రాష్ట్రంలోనే అతి పెద్దది. ఇక్కడ చదువుకునేందుకు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. అయితే దేశ వ్యాప్తంగా ర్యాగింగ్ చేసేవారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నా.. ఇక్కడ మాత్రం ఆ సంస్కృతి మానినట్లు కనిపించడం లేదు. జూనియర్లపై సీనియర్లు ర్యాగింగ్ చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా కొందరు విద్యార్థులకు లెక్చరర్లు కూడా సపోర్టు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో భాగంగా ఎంబీబీఎస్ విభాగంలోని సీనియర్ విద్యార్థులు జూనియర్లపై చేస్తున్న ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి.
తాజాగా ఇండోర్ లోని కొందరు విద్యార్థులు యాంటీ ర్యాగింగ్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి తాము ఎదుర్కొంటున్న కష్టాల గురించి చెప్పారు. సీనియర్ ఎంబీబీఎస్ విద్యార్థులు తమ ప్లాట్ల వద్ద ఉన్న దిండ్లతో సెక్స్ చేయాలని భలవంతపెడుతున్నారన్నారు. అలాగే బ్యాచ్ మేట్స్ తో సెక్స్ లో పాల్గొనాలని ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. అలాగే తమ బ్యాచ్ కు చెందిన గర్ల్స్ ను దుర్భషలాడాలని, వారిపై అరాచకానికి పాల్పడాలని ఒత్తిడి చేస్తున్నారని వారు తమ గోడును వెల్లడించుకున్నారు.
Also Read: Russia: ఏంటీ రష్యా ధైర్యం? ఏ దేశాన్ని లెక్కచేయకుండా ఏంటి ఈ దుందుడుకుతనం?
దీంతో హెల్ప్ లైన్ నుంచి సమాధానం వస్తూ.. ర్యాగింగ్ ను సహించేది లేదని వెంటనే యూజీసీని సంప్రదించాలని తెలిపింది. దీంతో కళాశాలలోని యాంటిర్యాగింగ్ కమిటీ నిందితులందరిపై చర్యలు తీసుకోవాలని ఇండోర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన పోలీసులు కళాశాలలోని ఎంబీబీఎస్ ఫ్రెషర్స్ అందరిక స్టేట్ మెంట్స్ రికార్డు చేయడం ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే ఓ విద్యార్థి తమ తోటి విద్యార్థినిని ఎన్నుకోవాలని బలవంతపెట్టారని ఆరోపించారు. అంతేకాకుండా ర్యాగింగ్ చేసేవాళ్లకు కొందరు ప్రొఫెసర్లు మద్దతు పలుకుతున్నారని అన్నారు.
అయితే యూజీసీకి చేసిన ఫిర్యాదులో వాట్సాప్ చాట్ తో సహా ఆడియో, వీడియో రికార్డులు అందినట్లు పోలీసులు తెలిపారు. ర్యాగింగ్ కు పాల్పడ్డ విద్యార్థులను గుర్తిస్తామని వారిపై చర్యలు తీసుకునేందుకు సంబంధిన కాలేజీలోని స్టేట్మెంట్లను రికార్డు చేస్తున్నామని తెలిపారు. అయితే ర్యాగింగ్ పై ఇప్పటి వరు కేసు నమోదు కాలేదు. కానీ త్వరలో నిందితులను గుర్తిస్తామని అంటున్నారు.
Also Read: ‘The Warrior’ 15 Days Collections: ‘ది వారియర్’ 15 డేస్ కలెక్షన్స్.. ఏ రేంజ్ లో నష్టాలో తెలుసా ?