Homeజాతీయ వార్తలుNarendra Modi: అవినీతి అంతంపై ప్రధానివి మాటలేనా.. చేతలు లేవా

Narendra Modi: అవినీతి అంతంపై ప్రధానివి మాటలేనా.. చేతలు లేవా

Narendra Modi: మన దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ‘మన్ కీ బాత్’ ప్రసంగం దేశవ్యాప్తంగా బాగా హైలైట్ అవుతున్న సంగతి అందరికీ విదితమే.ఆయన మాటలను ప్రజలు రేడియోల్లో, టీవీల్లో వింటుంటారు కూడా. కాగా, ఈ సారి ‘మన్ కీ బాత్’ మాటల్లో మోడీ అవినీతి గురించి మాట్లాడారు. దేశానికి పట్టిన పీడ అవినీతి అని, దానిని వదిలించుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. కాగా, ఏడేళ్ల కాలంలో మోడీ అవినీతి కోసం ఎటువంటి చర్యలు తీసుకున్నారని ఈ సందర్భంగా పలువురు ప్రశ్నిస్తున్నారు.

PM Narendra Modi
PM Narendra Modi

నిజానికి అవినీతి పరులను ఏరివేయడం కేంద్రప్రభుత్వాని పెద్ద పని ఏం కాదు. కానీ, ఆ దిశగా చర్యలు తీసుకున్నట్లు కనబడటం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు తీసుకుంటూ అవినీతిని ఇంకా పెంచి పోషిస్తున్నారు. ఇకపోతే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన వారు బీజేపీలో చేరిపోతున్నారు. బీజేపీతో సత్సంబంధాలు పెట్టుకుంటున్నారు కూడా. వారిపై విచారణకు ఎందుకు కేంద్ర ప్రభుత్వం విచారణకు పూనుకోవడం లేదని ఈ సందర్భంగా రాజకీయ పరిశీలకులు అడుగుతున్నారు.

Also Read: ఎంజీఆర్ ఆ గొప్ప నటుడిని తొక్కేస్తే.. ఎన్టీఆర్ పైకి తీసుకొచ్చారు !

ఆర్థిక నేరస్థులను బీజేపీలో చేరకుండా ఎందుకు అడ్డుకోవడం లేదనే ప్రశ్నలూ ఉన్నాయి. ఈడీ లాంటి సంస్థలు ఆధారాలతో పట్టుకున్నప్పటికీ చర్యలు తీసుకోవడంలో మాత్రం రాజకీయ వ్యవస్థ ప్రభావితం చేస్తున్నదనేది కాదనలేని అంశంగా ఉంది. పెద్ద పెద్ద రాజకీయ నాయకుల క్విడ్ ప్రోకో వ్యవహారాలపైన ఎందుకు కేంద్రప్రభుత్వం విచారణ జరపడం లేదనే ప్రశ్నకు కూడా కేంద్రం నుంచి సమాధానం రావడం లేదు. అవినీతిపైన దృష్టి సారించడమే లక్ష్యమని పేర్కొన్న బీజేపీ సర్కారు ఆ తర్వాత కాలంలో ఆ విషయం మరిచిపోయిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

C Voter Survey
Narendra Modi

నిజానికి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ అభ్యర్థిత్వం ఖరారైనప్పుడు దేశ ప్రజలందరూ కూడా నిజాయితీ కలిగిన నేత దేశ ప్రధాని కాబోతున్నాడని ఆనందపడిపోయారు. అవినీతి అంతం కోసం ప్రయత్నిస్తూ, నల్లధనం వెనక్కి తీసుకొచ్చి ప్రజలకు పంచి పెడతాడనే అభిప్రాయం ఉంది. కానీ, ఈ ఏడేళ్ల కాలంలో ఆ దిశగా చర్యలు అయితే కనబడటం లేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాన మంత్రిపైన ఇంకా ఆశలు పెట్టుకోవచ్చా? అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి.

ప్రధానమంత్రిగా మోడీ అభ్యర్థిత్వం ఖరారైనప్పుడు అవినీతిని అంతం చేస్తారని ప్రజలు అనుకున్నారు. స్విస్ బ్యాంక్ నుంచి డబ్బులు తెస్తారని అనుకున్నారు. బ్లాక్ మనీ గుట్టు రట్టు చేస్తారనుకున్నారు. కానీ ఇప్పటికీ ప్రధాని మోడీ అవినీతి అంతం గురించి మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ప్రజలకు మాత్రం ఓ క్లారిటీ వస్తోంది. ఈ రాజకీయ అవినీతిని ఎవరూ అంతం చేయలేరని.. నిట్టూరుస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను కుంగదీసే అవినీతి అంతమైనప్పుడే దేశం అభివృద్ధి చెందుతున్న అనే ట్యాగ్ నుంచి బయటపడుతుంది. లేకపోతే.. ఆర్థిక వినాశనమే జరుగుతోంది. మరి ప్రధానిపై ఇంకా ఆశలు పెట్టుకోవచ్చో లేదో మరి !

Also Read:  ‘అన్‌స్టాపబుల్’ సక్సెస్ కి కారణం ఆమె.. సుమన్ దాతృత్వ గుణం వైరల్ !

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
RELATED ARTICLES

Most Popular