https://oktelugu.com/

Ayodhya Ram Mandir: రామ్ లల్లాకు మోడీ ప్రాణప్రతిష్ట..భక్త “కోటి” చూసి తరించింది!

రాముడి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించి.. తొలి హారతి ఇచ్చారు. రాముడి విగ్రహం ఇతర సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం ఉద్వేగంగా మాట్లాడారు. అనేక ప్రశ్నలకు రాముడు మాత్రమే సమాధానమని.. రాముడు ఈ దేశంలోని ప్రతి మనిషి కణంలో ఉన్నారని.. చేసే పనికి సంబంధించి కట్టుకునే కంకణం లోనూ ఉన్నారని పేర్కొన్నారు..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 23, 2024 / 12:59 PM IST
    Ayodhya Ram Mandir

    Ayodhya Ram Mandir

    Follow us on

    Ayodhya Ram Mandir: ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత.. ఎందరో రామ భక్తుల పోరాటం తర్వాత రాముడి పురిటి గడ్డ అయిన అయోధ్యలో బాల రాముడు ప్రాణ ప్రతిష్ట చేసుకున్నాడు. వేలాదిమంది భక్తులు, వందలాదిమంది ముఖ్య అతిధుల మధ్య.. నరేంద్ర మోడీ సారథ్యంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఈ క్రతువును అన్ని న్యూస్ ఛానల్స్ ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ప్రాంతీయ, జాతీయ మీడియా అనే తారతమ్యం లేకుండా రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టలో పాలుపంచుకున్నాయి. ఇక సోషల్ మీడియా లోనూ రాముడు అత్యంత చర్చనీయాంశంగా వినతికెక్కాడు. అయితే ఈ రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట లో మరో అరుదైన సంఘటన చోటుచేసుకుంది.

    రాముడి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించి.. తొలి హారతి ఇచ్చారు. రాముడి విగ్రహం ఇతర సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం ఉద్వేగంగా మాట్లాడారు. అనేక ప్రశ్నలకు రాముడు మాత్రమే సమాధానమని.. రాముడు ఈ దేశంలోని ప్రతి మనిషి కణంలో ఉన్నారని.. చేసే పనికి సంబంధించి కట్టుకునే కంకణం లోనూ ఉన్నారని పేర్కొన్నారు.. మోడీ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత యూట్యూబ్ ఛానల్ కలిగి ఉన్నారు. దాదాపు రెండు కోట్లకు పైగా ప్రజలు ఆయనను అనుసరిస్తున్నారు. ఇక నిన్న జరిగిన బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన లైవ్ ఆయన యూట్యూబ్ ఛానల్ లో ప్రసారమైంది. ప్రస్తుతం అది అత్యంత ప్రభావంతమైన జాబితాలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. దీనిని ఇప్పటికే కోటికి పైగా ప్రజలు వీక్షించాలని యూట్యూబ్ లెక్కలు చెబుతున్నాయి.. అంతేకాదు రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టతో భారత దేశ ఖ్యాతి పెరిగిందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

    కేవలం మీడియా, సోషల్ మీడియాలోనే కాకుండా గూగుల్ ట్రెండ్స్ లోనూ అయోధ్య బాలరాముడు చర్చనీయాంశమైన విషయంగా పేరు పొందాడు. మొదటి 20 అంశాలలో దాదాపు 19 అయోధ్య రాముడు, భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, అయోధ్య ఆలయ నిర్మాణం, బాల రాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ట, గతంలో అయోధ్యలో ఎందుకు వివాదం జరిగింది? వంటి అంశాలను నెటిజెన్లు తెగ శోధించారు. కేవలం భారత్ వ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ అంశాలు టాప్ వరుసలో ఉండటం విశేషం.. కాగా ఒక దైవ పరమైన అంశం యూట్యూబ్ లో అత్యంత ప్రభావశీలమైన అంశంగా ఉండటం..అది కూడా ఒక హిందూ మతానికి సంబంధించింది కావడం.. ఒక విశేషమే అని నెటిజన్లు చెబుతున్నారు. రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట, రామ జ్యోతి వంటి అంశాలు తమను బాగా ఆకట్టుకున్నాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం కూడా తమను ఆనంద డోలికల్లో ముంచేసిందని చెప్తున్నారు.