Central Budget: నిస్సారమైన బడ్జెట్ పై ప్రశంసాలా?

Central Budget: కరోనా సమయంలో పేద, మధ్యతరగతి, వేతన జీవులకు ఊరట కల్పించేలా కేంద్రం బడ్జెట్ ఉంటుందని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తలకిందులు చేశారు. గతంలో ఎన్నడూ లేనటువంటి నిస్సారమైన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అసలు ఈ బడ్జెట్ వల్ల ఎవరికీ ఉపయోగం? అనే ప్రశ్నలు అన్ని వర్గాల నుంచి విన్పిస్తుంటే ఆపార్టీ నేతలు మాత్రం స్వీయ పొగడ్తలు చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతీసారి […]

Written By: NARESH, Updated On : February 4, 2022 5:07 pm
Follow us on

Central Budget: కరోనా సమయంలో పేద, మధ్యతరగతి, వేతన జీవులకు ఊరట కల్పించేలా కేంద్రం బడ్జెట్ ఉంటుందని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తలకిందులు చేశారు. గతంలో ఎన్నడూ లేనటువంటి నిస్సారమైన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అసలు ఈ బడ్జెట్ వల్ల ఎవరికీ ఉపయోగం? అనే ప్రశ్నలు అన్ని వర్గాల నుంచి విన్పిస్తుంటే ఆపార్టీ నేతలు మాత్రం స్వీయ పొగడ్తలు చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతీసారి ఏదో ఒక రంగాన్ని హైలెట్ చేస్తూ నిధులు కేటాయిస్తోంది. కానీ ఈసారి అదేమీ కన్పించలేదు. ఏ ఒక్క రంగాన్ని కానీ వర్గాన్ని పరిణగలోకి తీసుకోలేదని తెలుస్తోంది. చివరికీ కరోనా దెబ్బకు పిట్టల్లా రాలిపోతున్న ప్రజల ప్రాణాలను సైతం కేంద్రం పట్టించుకోలేదనే వాదనలు విన్పిస్తున్నాయి. వైద్య సదుపాయాలు మెరుగుపర్చేందుకు జీడీపీలో పదిశాతమైన ఈ రంగానికి ఖర్చు చేయాలని మేధావులు మొత్తుకుంటున్నారు. అయినా కూడా ఈ బడ్జెట్లో పెద్దగా నిధులు కేటాయించలేదు.

Also Read: 50 రోజుల్లో 350 కోట్లు.. పుష్పరాజ్ రేంజ్ ఇది !

హంగర్ ఇండెక్స్‌లో భారత్ 106 స్థానంలో ఉంది. లాక్ డౌన్ సమయంలో రోడ్డున పడిన జనాన్ని చూసిన తర్వాత చాలామందికి ఇదే నిజమనేనే అభిప్రాయం ఏర్పడింది. కేంద్రం మాత్రం పేదల కోసం కేటాయిస్తున్న ఆహార సబ్సిడీని మరింత దారుణంగా తగ్గించింది. కరోనా కాలంలో సగానికి సగం తగ్గించగా ఉపాధి నిధులపై భారీగా కోత పెట్టారు. లాక్ డౌన్ సమయంలో లక్షలమంది పల్లెబాట పట్టారు. ఈ పథకానికి నిధులు కేటాయించడంతో అక్కడి ఉపాధికి ఇబ్బందులు ఏర్పడనున్నాయి.

మరోవైపు రాబోయే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగులు కల్పిస్తామని బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆమె వ్యాఖ్యలను కేవలం గాలిమాటలుగానే ఆర్థిక నిపుణులు చూస్తున్నారు. జనాలకు అర్థం కానీ భాషలో అమృత్ కాల్, వికాస్, ఆత్మనిర్భర్ అంటారు తప్పా ఆచరణలో మాత్రం ఏది కన్పించడం లేదు. గతంలో కేంద్రం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీతో ఎవరు లాభపడ్డారో ఇప్పటికీ ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఈ బడ్జెట్ కూడా అంతేననే కామెంట్స్ విన్పిస్తున్నాయి.

ఈ జనవరిలో లక్షా 40వేల కోట్ల జీఎస్టీ ఆదాయం వచ్చిందని ఇది చరిత్రలో తొలిసారని నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. బడ్జెట్ సమయంలో ఆమె వ్యాఖ్యలు బీజేపీ నేతలు చప్పట్లతో హోరెత్తించారు. అయితే ప్రజల దగ్గర పన్నులు వసూలు చేయడమే అభివృద్ధా? అంటూ సామాన్యులు నోరెళ్లబెడుతున్నారు. చివరికీ బిచ్చమెత్తుకునే వాళ్లు కొనుక్కునే చిన్న బన్ను, బిస్కెట్లకు కూడా జీఎస్‌టీ కడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పరోక్ష పన్నులతోపాటుగా పెట్రోల్, డీజిల్, మద్యం పన్నులను కేంద్రం అదనంగా బాదుతోంది. జీతాలపై ఆధారపడిన వేతన జీవులను కనీసం బడ్జెట్లో పట్టించుకోకపోవడంపై ఆ వర్గాల్లో వ్యతిరేకత వస్తోంది. మొత్తంగా ఈ బడ్జెట్ చూస్తే దూరదృష్టి లేని బడ్జెట్ గానే కన్పిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం ఈ బడ్జెట్ పై బీజేపీ మద్దతు దారులు, నేతలు భారీగా ప్రచారం చేసుకోవడం విశేషం.

Also Read:  రాజభవనాలు వదిలి అద్దె ఇళ్లల్లో ఉంటున్న టాలీవుడ్ స్టార్లు వీళ్లే..!