Raja Saab Advance Bookings: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటించిన ‘రాజా సాబ్'(Raja saab Movie) చిత్రం సరిగ్గా మరో 17 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘కల్కి 2898 AD’ చిత్రం తో వెయ్యి కోట్ల గ్రాస్ మార్కుని అందుకున్న ప్రభాస్ నుండి, కొంత గ్యాప్ తర్వాత రాబోతున్న చిత్రమిది. అయితే ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ చేస్తే యాక్షన్ మూవీస్ చెయ్యాలి, లేదా కల్కి లాంటి భారీ గ్రాండియర్ చిత్రం చెయ్యాలి, కానీ మీడియం రేంజ్ హీరోలు చేసే హారర్ జానర్ చిత్రాలను చేయడం ఏంటి?, ఆయన స్థాయికి ఇది తగునా? అని అభిమానులు ఈ సినిమా ప్రకటన సమయం లో చాలా ఫీల్ అయ్యారు. ఇప్పటికీ అభిమానుల్లో ఈ చిత్రం పై భారీ ఆశలు లేవు. డైరెక్టర్ మారుతీ హిట్ ట్రాక్ లో లేడు, అంతే కాకుండా ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన ఏ ప్రమోషనల్ కంటెంట్ కూడా ఫ్యాన్స్, ఆడియన్స్ ని ఆకట్టుకోలేదు.
కాబట్టి ఈ చిత్రం కమర్షియల్ గా ఫ్లాప్ అవుతుందని ఫ్యాన్స్ బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయారు. ఫ్యాన్స్ కే అలాంటి అంచనాలు ఉన్నప్పుడు, ఇక మామూలు ఆడియన్స్ లో ఎలాంటి అంచనాలు ఉంటాయో ఊహించగలరుగా?, ఫలితంగా ఈ సినిమా ఓవర్సీస్ బుకింగ్స్ పై తీవ్రమైన ప్రభావం చూపించాయి. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే, ఈ సినిమాకు కేవలం ఒక్క నార్త్ అమెరికా కి 10 మిలియన్ డాలర్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ని చూస్తుంటే ఈ సినిమాని కొనుగోలు చేసిన బయ్యర్ కి వణుకు పడుతుంది అనే చెప్పొచ్చు. అక్కడి ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ సినిమాకు ఇప్పటి వరకు వచ్చిన అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ కేవలం $141K డాలర్లు మాత్రమే.
రోజుకి కేవలం 5 వేల డాలర్లు మాత్రమే పెరుగుతూ వస్తోంది. గేమ్ చేంజర్, హరి హర వీరమల్లు చిత్రాలకు కూడా నార్త్ అమెరికా ప్రీమియర్ షోస్ నుండి పరాభవం ఎదురయ్యాయి కానీ, ‘రాజా సాబ్’ కి అంతకు మించిన పరాభవం ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ కి టాక్ కాస్త తేడా కొడితే, ఫుల్ రన్ లో ఈ చిత్రం కనీసం 1.5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను కూడా ఈ చిత్రం రాబట్టలేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అదే జరిగితే, టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్ గా ఈ చిత్రం నిలుస్తుందని అంటున్నారు. ఇక అభిమానులు ఈ సినిమా కు సంబంధించిన రిలీజ్ ట్రైలర్, మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ మీదనే ఆశలు పెట్టుకున్నారు. ఇవి రెండు క్లిక్ అయితే అడ్వాన్స్ బుకింగ్స్ ఊపందుకుంటాయని అనుకుంటున్నారు, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.