కరోనా విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల వల్ల దేశంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గతంతో పోలిస్తే పరిస్థితుల్లో మార్పు వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రజలు కరోనా వైరస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన స్కీమ్ నువచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
Also Read: వాహనదారులకు మోదీ సర్కార్ శుభవార్త.. అమల్లోకి కొత్త నిబంధనలు..?
కేంద్ర ప్రభుత్వం కరోనా విజృంభణ నేపథ్యంలో ఫ్రీగా ఆహార ధాన్యాలు అందజేయాలనే ఉద్దేశంతో పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన స్కీమ్ ను ప్రారంభించారు. ఈ స్కీమ్ వల్ల దేశంలోని ప్రజలకు ఫ్రీగా రేషన్ తో పాటు ఇతర ఆహార ధాన్యాలు అందాయి. కేంద్రం నవంబర్ వరకు ఈ స్కీమ్ ను అమలు చేయగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని స్కీమ్ ను పొడిగించాలని భావిస్తోందని తెలుస్తోంది.
Also Read: అమెజాన్ పై బ్యాన్ విధించాలంటున్న వ్యాపారులు.. ఏం జరిగిందంటే..?
కేంద్రం దగ్గర ప్రస్తుతం ప్రజల అవసరాలకు సరిపోయే బియ్యం, పప్పు, ఇతర నిల్వలు ఉన్నాయి. ఈ స్కీమ్ ద్వారా ప్రజలకు ఆయా రాష్ట్రాలను బట్టి బియ్యం, గోధుమలు, కందిపప్పు అందుతున్నాయి. కేంద్రం పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన స్కీమ్ ను అమలు చేయడం ద్వారా తమకు ఎంతో ప్రయోజనం చేకూరుతోందని ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని వార్తల కోసం: ప్రత్యేకం
కేంద్రం ఈ స్కీమ్ గడువును పొడిగిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతోంది. దేశంలో తెల్ల రేషన్ కార్డులు ఉన్న 80 కోట్ల మంది కేంద్రం అమలు చేస్తున్న ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందారు. కేంద్రం ఇప్పటివరకు ఈ స్కీమ్ కోసం లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అయితే కేంద్రం నుంచి ఈ స్కీమ్ గడువును పొడిగిస్తున్నట్టు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.