
ఒక మాట మీద ఉండే వ్యక్తిని.. ఎవరైనా ఆరాధిస్తారు.. ఆదరిస్తారు. మాట తప్పిన నేతను ఆయన మాట మీద నిలకడ ఉండదు అని తిట్టిపోస్తుంటారు. పవన్ కల్యాణ్ విషయంలో అదే రుజువైంది. పవన్ కల్యాణ్ స్థిరమైన రాజకీయాలు చేయలేరన్నది మరోసారి స్పష్టమైంది. ఎప్పుడు ఏం మాట్లాడుతారో.. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ అర్థం కావడం లేదు. అప్పుడే పోటీ అంటాడు.. అప్పుడే మద్దతు అంటాడు.. ఈ జనసేన అధినేత వైఖరితో అటు నాయకత్వంలోనూ అసహనం కనిపిస్తోంది.
Also Read: పవన్ ఉసరవెల్లి.. ‘జనసేన’ ఎందుకంటూ ప్రకాశ్ రాజ్ సూటి ప్రశ్న?
గ్రేటర్ ఎన్నికల్లో తమ పార్టీ కూడా పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ ప్రకటించగానే గ్రేటర్‌లోని జనసేన కార్యకర్తల ఉత్సాహానికి అదుపులేకుండా పోయింది. గెలుపు సంగతి పక్కన పెడితే తమ పార్టీ ఇక్కడ పోటీ చేస్తుండటం తమకు భవిష్యత్‌లో కలిసి వస్తుందని జనసైనికులు భావించారు. బీజేపీతో కలిసి పోటీ చేస్తే కొన్ని చోట్లైనా గెలిచి గ్రేటర్‌లో తమ ప్రాతినిధ్యం ఉంటుందని ఆశపడ్డారు. కానీ పవన్ కల్యాణ్ వారి ఆశలపై నీళ్లు చల్లుతూ పోటీ చేయడం లేదని ప్రకటించారు.
పవన్ కల్యాణ్‌ను ఎవరు అడగకముందే పోటీచేస్తున్నట్లు ప్రకటించారు. ఏపీలో బీజేపీతో ఎవరిని అడగకుండానే పొత్తు పెట్టుకున్నారు. అయితే.. అక్కడ ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని పార్టీలో అనేక మంది అప్పట్లోనే నిరసించారు. సోషల్ మీడియాలో సైతం పవన్ కల్యాణ్ నిర్ణయాన్ని ఆయన అభిమానులే తప్పు పట్టారు. నాలుగేళ్లకు ముందే కమలం పార్టీతో పొత్తు ఏంటని నిలదీశారు. అసలు ఇప్పుడు పొత్తు అంశం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.
Also Read: జగన్ సర్కార్ కు షాకిచ్చిన ఏపీ హైకోర్టు
ఇప్పుడు గ్రేటర్‌లోనూ ముందుగా పోటీ చేస్తామని చెప్పి.. ఇప్పుడు తప్పుకోవడంపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. ముందే పోటీకి దిగడం లేదని చెబితే గౌరవంగా ఉండేది కదా అని జనసేనకులు వాపోతున్నారు. పవన్ దుందుడుకు నిర్ణయాలు, అనాలోచిత, ఆవేశ ప్రకటనలు ఆయన ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నాయని చెప్పక తప్పదు. పవన్ నిర్ణయాలు కార్యకర్తల్లోనూ నిరాశను కలిగిస్తున్నాయి. పవన్ తీరును చూసి ఇంకా ఆయనకు రాజకీయ పరిణితి రాలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదైనా ఒక స్టాండ్ తీసుకొని దాని మీద నిలబడితే గానీ పవన్ ఇమేజీ పెరుగుతుందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్