Site icon OkTelugu

UP Lakhimpur Kheri: ఏనుగులతో సెల్ఫీ కోసం వెళ్తే ఏమైందో తెలుసా.. మీరే చూడండి..

UP Lakhimpur Kheri

UP Lakhimpur Kheri

UP Lakhimpur Kheri: ప్రపంచంలో అతి పెద్దది.. అత్యంత బలమైన జంతువు ఏంటి టక్కున గుర్తొచేది ఏనుగు. క్రూర మృగం కాకపోయినా దాని జోలికి వెళ్తే మాత్రం ఊరుకోదు. ఏనుగు రెచ్చిపోతే చుట్టుపక్కల ఏమీ మిగతలదు. దానికి కోపం రాకుంటే మాత్రం తన దారిన అది వెళ్లిపోతుంది. కానీ ఇక్కడ యువకుల చేష్టలతో గజరాజులకు కోపం వచ్చింది. మంద రెచ్చిపోయింది. దీంతో ఆ యువకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయేందు ప్రయత్నించారు. ఈ క్రమంలో కింద పడుతూ లేస్తూ పరుగులు పెట్టారు. ముగ్గురిలో ఓ యువకుడు పాపం కింద పడిపోయాడు.

సెల్ఫీ దిగబోయి..
గజరాజులతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపించే వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ సందర్భంగా ముగ్గురు స్నేహితులు ఏనుగులతో సెల్ఫీ దిగబోయి ప్రమాదంలోంచి తృటిలో బయటపడ్డారు. ఈ సంఘటన యూపీ రాష్ట్రంలోని లఖింపూర్‌ఖేరీ జిల్లాలో జరిగింది. ఏనుగుల గుంపుతో సెల్ఫీ దిగేందుకు వెళ్లిన ముగ్గురు వ్యక్తులకు ఏనుగులు చుక్కలు చూపించాయి. యువకుల చేష్టలతో ఒక్కసారిగా రెచ్చిపోయిన గజరాజుల మంద వారి వెంట పడి పరుగెత్తించింది.. దీంతో వారు ప్రాణాలు అర చేతిలో పట్టుకుని పారిపోయేందు ప్రయత్నించారు.

మరణం అంచుల వరకు వెళ్లి..
ఈ క్రమంలో కింద పడుతూ లేస్తూ పరుగులు పెట్టారు. ముగ్గురిలో ఓ యువకుడు పాపం కింద పడిపోయాడు. కానీ మళ్లీ లేచి పరిగెత్తాడు. ముగ్గురు యువకులను ఏనుగుల మంద వెంబడించగా, అక్కడే ఉన్న ఓ యువకుడు ఈ ఘటనను తన సెల్‌ఫో¯Œ కెమెరాలో బంధించాడు. ఏనుగుల దగ్గర సెల్ఫీలు దిగడం కోసం ప్రయత్నించిన ముగ్గురు స్నేహితులకు దాదాపు మరణం అంచులదాకా వెళ్లివచ్చారు.

జనావాసాల్లోకి గజరాజులు..
అడవులు అంతరించిపోతుండడం, వేసవిలో అడవుల్లో నీళ్లు, ఆహారం దొరకపోవడంతో గజరాజులు సమీపంలోని ఊళ్లలోకి వస్తున్నాయి. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. పంటలను నాశనం చేస్తున్నాయి. అడ్డుకోబోయినవారిపై దాడిచేసి చంపేస్తున్నాయి. వ్యవసాయం పేరుతో వాటి ఆవాసాల్లోకి వెళ్తుండడంతో అవి మన ఆవాసాల్లోకి వస్తున్నాయి. తాజాగా ముగ్గురు యువకులు వాటితో సరదాగా సెల్ఫీ దిగాలనుకుంటే… చివరకు ఇలా చావు తప్పి కన్ను సొట్టపోయిన చందంగా తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.

Exit mobile version