పెట్రోల్‌ ధరలు నో బ్రేకులు

పెట్రోల్‌ ధరలు బ్రేకులు పడడం లేదు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతున్నాయి. ఏన్డీఏ ఏర్పడిన కొత్తలో 60 రూపాయలకు అటుఇటుగా ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇప్పుడు ఏకంగా రూ. 90 చేరాయి. జనాలకు నొప్పి తెలియకుండానే ప్రతిరోజూ లీటర్‌‌కు రూ.20 పైసలు, రూ. 30 పైసల చొప్పున పెంచుకుంటూ పోతున్నారు. Also Read: భారత్ బంద్ ఎందుకు ? గతంలో ఐదారు నెలలకోసారి పెరిగేవి గ‌తంలో యూపీఏ హయాంలో ఐదారు నెల‌ల‌కు ఒక‌సారి […]

Written By: Srinivas, Updated On : December 8, 2020 12:38 pm
Follow us on


పెట్రోల్‌ ధరలు బ్రేకులు పడడం లేదు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతున్నాయి. ఏన్డీఏ ఏర్పడిన కొత్తలో 60 రూపాయలకు అటుఇటుగా ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇప్పుడు ఏకంగా రూ. 90 చేరాయి. జనాలకు నొప్పి తెలియకుండానే ప్రతిరోజూ లీటర్‌‌కు రూ.20 పైసలు, రూ. 30 పైసల చొప్పున పెంచుకుంటూ పోతున్నారు.

Also Read: భారత్ బంద్ ఎందుకు ?

గతంలో ఐదారు నెలలకోసారి పెరిగేవి

గ‌తంలో యూపీఏ హయాంలో ఐదారు నెల‌ల‌కు ఒక‌సారి పెట్రోల్‌ ధరలు పెంచేవారు. అది కూడా రూపాయో, రెండు రూపాయలో పెరిగితే అప్పటి ప్రతిపక్షం, ప్రస్తుతం రూలింగ్‌ పార్టీ ప్రజలపై భారం మోపుతున్నారంటూ ఆందోళ చేసేది. కానీ, అప్పుడు ధర్నాలు చేసిన వారే.. ఇప్పుడు ప్రతిరోజూ ధరలు పెంచుతున్నారు. ముంబైలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 90కి చేరడం గమనార్హం. మరో రెండు మూడు నెలల్లో రూ.100కు పెరిగినా ఆశ్చర్య పడాల్సింది ఏమీ లేదు.

క్రూడాయిల్‌ ధరలు తగ్గినా..

లాక్ డౌన్ ఎఫెక్ట్‌తో అంత‌ర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధరలు విపరీతంగా తగ్గాయి. దాదాపు సగానిపైగా పడిపోయాయి. అయినా కేంద్ర సర్కారు మాత్రం పెట్రోల్‌ ధరలు తగ్గించకపోగా.. ప్రతిరోజూ పెంచుతున్నది. ఇందుకు వెలుసుబాటు కల్పించేలా.. అంటే పెట్రోల్ ధ‌ర‌ల‌ను ఇష్టానుసారం పెంచుకునేలా ఓ బిల్లును కూడా పాస్ చేసింది.

Also Read మోడీపై కేసీఆర్ పగ.. భారత్ బంద్ లో టీఆర్ఎస్ హోరు

రాష్ట్రాలు కూడా కిమ్మనడం లేదు

పెట్రోలు ధరలు రూ.100కు పరుగులు పెడుతున్నా.. రాష్ట్రాలు కూడా కిమ్మనడం లేదు. ఇందుకు ఓ కారణం ఉంది. కేంద్రం ధరలు పెంచినప్పుడల్లా వ్యాట్‌ రూపంలో రాష్ట్రానికి కూడా ఆదాయం పెరుగుతోంది. దీంతో రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న స్వపక్ష, విపక్ష, మిత్రపక్ష పార్టీలు కూడా స్పందించడం లేదని తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ గురించి చెప్పేదేముంది. పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై కనీసం నిరసనలు కూడా తెలుపకపోవడం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతుంది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్