https://oktelugu.com/

విజయశాంతి బీజేపీలోనైనా రాణిస్తుందా?

1998లో బీజేపీలో చేరడం ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించింది రాములమ్మ. అంతేకాదు బీజేపీ విమెన్స్‌ వింగ్‌ (భారతీయ మహిళా మోర్చా) సెక్రటరీగా కూడా పనిచేసింది. అయితే ఆ తరువాత బీజేపీ నుంచి బయటకు వచ్చిన విజయశాంతి.. 2009లో తల్లి తెలంగాణ అని సొంత పార్టీని స్థాపించింది. Also Read: టీపీసీసీ చీఫ్: శ్రీధర్ బాబు అయితే అందరికీ ఓకే? తరువాత దాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేసింది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ తరఫున 2009 ఎన్నికల్లో ఎంపీగా […]

Written By:
  • NARESH
  • , Updated On : December 8, 2020 / 12:30 PM IST
    Follow us on

    1998లో బీజేపీలో చేరడం ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించింది రాములమ్మ. అంతేకాదు బీజేపీ విమెన్స్‌ వింగ్‌ (భారతీయ మహిళా మోర్చా) సెక్రటరీగా కూడా పనిచేసింది. అయితే ఆ తరువాత బీజేపీ నుంచి బయటకు వచ్చిన విజయశాంతి.. 2009లో తల్లి తెలంగాణ అని సొంత పార్టీని స్థాపించింది.

    Also Read: టీపీసీసీ చీఫ్: శ్రీధర్ బాబు అయితే అందరికీ ఓకే?

    తరువాత దాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేసింది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ తరఫున 2009 ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించింది. ఆ తరువాత టీఆర్‌ఎస్‌లో విబేధాలు రావడంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి.. 2014లో కాంగ్రెస్‌లో చేరింది. ఈ క్రమంలో 2014 ఎన్నికల్లో మెదక్‌ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయింది.

    కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన విజయశాంతి… బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్‌ సింగ్‌.. విజయశాంతికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కొద్ది రోజులుగా కాంగ్రెస్‌ పార్టీకి దూరంగా ఉంటున్న రాములమ్మ… హస్తిన వెళ్లి ముందుగా అమిత్‌షాను కలిసింది. తర్వాత నిన్న అధికారికంగా కాషాయ పార్టీ కండువా కప్పుకున్నారు. 1998 జనవరి 26న బీజేపీలో చేరిన విజయశాంతి.. మళ్లీ ఇన్నాళ్లకు సొంతగూటికి చేరడం విశేషం.

    Also Read: గూగుల్ ఉద్యోగి హైదరాబాద్ కార్పొరేటర్ ఎలా అయ్యింది.

    2005లో కొన్ని కారణాలతో బీజేపీ పార్టీని వీడినట్లు విజయశాంతి చెప్పారు. కేసీఆర్‌ ఒత్తిడి కారణంగా తల్లి తెలంగాణ పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశానన్నారు. తెలంగాణ ఇస్తున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన రోజే కేసీఆర్‌ తనను టీఆర్‌ఎస్‌ నుంచి తొలగించారని.. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరానన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన కొంతమంది కాంగ్రెస్‌ నేతలు ఆయనతో చేతులు కలిపారని ఆరోపించారు రాములమ్మ.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    బీజేపీలో విజయశాంతికి ఎలాంటి పదవి ఇస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడైనా ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె తెలిపారు. తెలంగాణలో బీజేపీయే ప్రత్యామ్నాయమన్న ఆమె… పార్టీని బలోపేతం చేస్తా అంటూ భరోసా ఇచ్చింది రాములమ్మ. మరి ఇన్ని పార్టీలు మారిన రాములమ్మ కనీసం బీజేపీలోనైనా రాణిస్తుందా లేదా అన్నది చూడాలి.