https://oktelugu.com/

Odisha Politics: బీజేపీ ఎక్కువ సీట్లు కోరడం వెనుక అసలు కారణం ఇదే

సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిస్సా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బిజెపితో పొత్తు పెట్టుకుని పోటీ చేయాలని బిజెడి భావించింది. కానీ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వద్ద ప్రతిష్టంభన ఏర్పడినట్లు సమాచారం.

Written By:
  • Dharma
  • , Updated On : March 10, 2024 3:01 pm
    Odisha Politics

    Odisha Politics

    Follow us on

    Odisha Politics: బిజెపికి నమ్మదగిన మిత్రుల్లో ఒడిశాలో నవీన్ పట్నాయక్ ఒకరు. బిజెపితో పొత్తు పెట్టుకుని ఒడిస్సాలో అధికారంలోకి వచ్చిన నవీన్ సుదీర్ఘకాలం ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. పొత్తులో భాగంగా బీజేడీ బలోపేతం అయినా.. బిజెపి బలపడకపోవడం విశేషం. అయితే బిజెపి సహకారంతో అధికారంలోకి వచ్చాను అన్న అభిమానంతో జాతీయస్థాయిలో ఎన్నడూ బిజెపిని వ్యతిరేకించలేదు. ఆ పార్టీకి దూరం జరిగినా కాంగ్రెస్ కు దగ్గర కాలేదు.ఇప్పుడు అదే అభిమానంతో 2024 ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకోవాలని నవీన్ భావించారు. కానీ బిజెపి నుంచి సీట్ల డిమాండ్ పెరగడంతో ఒంటరి పోరుకు బీజేడీ సిద్ధమైందని ప్రచారం జరుగుతోంది.

    సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిస్సా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బిజెపితో పొత్తు పెట్టుకుని పోటీ చేయాలని బిజెడి భావించింది. కానీ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వద్ద ప్రతిష్టంభన ఏర్పడినట్లు సమాచారం. ఒడిస్సాలో మొత్తం 147 అసెంబ్లీ, 21 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అన్ని స్థానాల్లో బిజెపి తన అభ్యర్థులను నిలబెడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ ప్రకటించారు. అధికార బీజేడీతో సీట్ల సర్దుబాటు విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడం వల్లే ఈ నిర్ణయం ప్రకటించినట్లు తెలుస్తోంది.

    తొలిసారిగా 2000లో బిజెపితో బిజెపి పొత్తు పెట్టుకుంది. ఆ ఎన్నికల్లో కూటమి విజయం సాధించింది. నవీన్ పట్నాయక్ సీఎం అయ్యారు. ఒడిస్సా పై పట్టు సాధించారు. అయితే బిజెపి మాత్రం బలోపేతం కాలేదు. అరకొర సీట్లను మాత్రమే ఆ పార్టీ దక్కించుకుంటూ వస్తోంది. గత ఎన్నికల్లో బిజెడి 12 స్థానాల్లో గెలుపొందగా.. బిజెపి ఎనిమిది లోక్ సభ స్థానాలను గెలుచుకుంది. దీంతో బిజేడితో సమానంగా బిజెపి సీట్లు కోరుకుంటుంది. మొత్తం 21 లోక్ సభ స్థానాలకు గాను.. బిజెపి 14 స్థానాలను డిమాండ్ చేస్తుంది. అటు అసెంబ్లీ స్థానాల్లో సైతం సగం సీట్లను కోరుతోంది. అన్ని సీట్లు ఇచ్చేందుకు బీజేడీ మొగ్గు చూపించడం లేదు. దాని ఫలితంగా సీట్ల సర్దుబాటు విషయంలో చిక్కుముడి ఎదురైంది. బిజెపి ఒంటరి పోరుకు సిద్ధమైంది. అయితే ఈ విషయంలో అమిత్ షా ప్రత్యేకంగా దృష్టి పెడతారని తెలుస్తోంది. వీలైనంతవరకు ఒడిస్సాలో బీజేడీతో పొత్తుకే బిజెపి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మరి అది ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.