ఫోర్బ్స్ టాప్ 10లో ముకేశ్ అంబానీ

ఫోర్బ్స్ టాప్ 10లో ఈసారి కూడా భారతీయ నంబర్ వన్ బిలినియర్ ముకేశ్ అంబానీ స్థానం సంపాదించాడు. వరుసగా ఫోర్బ్స్ లో టాప్ ప్లేస్లో స్థానం సంపాదిస్తున్నాయి. ఒకవైపు కరోనా ప్రపంచదేశాలను కుదిపేస్తున్నా.. కుబేరుల ఆస్తులు మాత్రం పెరిగిపోతున్నాయి. వ్యాపారాలు అభివృద్ధి చెందుతున్నాయి. దీంతో ఆస్తులు పెంచుకోవడంలో సదరు వ్యాపారులు రికార్డులు సృష్టిస్తున్నారు. అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ వరుసగా నాలుగో ఏడాది ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో నిలిచారు. ఏడాదికాలంగా ప్రపంచాన్ని కరోనా పట్టి పీడిస్తున్నప్పటికీ.. కుబేరుల […]

Written By: Srinivas, Updated On : April 7, 2021 1:34 pm
Follow us on


ఫోర్బ్స్ టాప్ 10లో ఈసారి కూడా భారతీయ నంబర్ వన్ బిలినియర్ ముకేశ్ అంబానీ స్థానం సంపాదించాడు. వరుసగా ఫోర్బ్స్ లో టాప్ ప్లేస్లో స్థానం సంపాదిస్తున్నాయి. ఒకవైపు కరోనా ప్రపంచదేశాలను కుదిపేస్తున్నా.. కుబేరుల ఆస్తులు మాత్రం పెరిగిపోతున్నాయి. వ్యాపారాలు అభివృద్ధి చెందుతున్నాయి. దీంతో ఆస్తులు పెంచుకోవడంలో సదరు వ్యాపారులు రికార్డులు సృష్టిస్తున్నారు.

అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ వరుసగా నాలుగో ఏడాది ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో నిలిచారు. ఏడాదికాలంగా ప్రపంచాన్ని కరోనా పట్టి పీడిస్తున్నప్పటికీ.. కుబేరుల సంపద మరింతగా పెరగడం విశేషమని ఫోర్బ్స్ తన 2021 వార్షిక ప్రపంచ బిలియనీర్ల జాబితాలో వెల్లడించింది. రికార్డు స్థాయిలో ఈ ఏడాది 2,755 మంది బిలియనీర్లు (దాదాపు రూ.7350 కోట్ల కన్నా ఎక్కువ సంపద ఉన్నవారు) జాబితాలో చోటు దక్కించుకున్నారని సంస్థ మంగళవారం వెల్లడించింది.

వీరిమొత్తం సందప 13.1 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుందని,.. ఇది గతేడాది నాటి 8 లక్షల కోట్ల డాలర్ల కన్నా చాలా ఎక్కువ అని తెలిపింది. ఇఖ గతేడాది 31వ స్థానంలో ఉన్న టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎలాన్ మస్క్ రెండోస్థానంలో నిలిచారు. విలాసవంత వస్తువుల కంపెనీ ఎల్వీఎంహెచ్ అధిపతి బెర్నార్డ్ ఆర్నాల్డ్, మైక్రోసాఫ్ట్ అధిపతి బిల్ గెట్స్, ఫేస్ బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్ బర్గ్ టాప్5లో చోటు దక్కించుకున్నారు. రెండు దశాబ్దాల తరువాత తొలిసారి వారెన్ బఫెట్ తొలి ఐదు స్థానాల నుంచి బయటకు వెళ్లారు.

రిలయన్స్ ఇండస్ర్టీస్ అధిపతి, ఆసియాలో అత్యంత ధనవంతుడు ముకేశ్ అంబానీ 84.5 బిలియన్ డాలర్లతో పదో స్థానం సంపాదించారు. చైనాకు చెందిన జాక్ మా సంపద 10 మిలియన్ డాలర్లు పెరిగి 48.4బి డాలర్లకు చేరినా.. 26వ స్థానానికే పరిమితం అయ్యారు. మార్చి 5నాటి షేర్ల ధరలు, ఎక్సేంజ్ రేట్ల ఆధారంగా బిలియనీర్ల సందపను లెక్కగట్టినట్లు ఫోర్బ్స్ తెలిపింది. ఈ ఏడాది కొత్తగా 493 మంది జాబితాలో చేరారు.