అమ్మకానికి విశాఖ నగరం.. ప్రజల అయోమయం

ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని చేయాలనుకున్న విశాఖలో ముందుగా భూముల్ని అమ్మేస్తోంది. రాజధాని చేయాలనుకున్నప్పుడు అక్కడ లెక్కలేనన్ని భూముల అవసరాలు ఉంటాయి. వాటికోసం ప్రభుత్వ భూములు ఏమైనా ఉంటే ముందునుంచే జాగ్రత్త చేసుకుంటారు. కానీ ఏపీ సర్కారు మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో అక్కడకు రాజధాని తరలించకముందే.. అందుబాటులో ఉన్న విలువైన భూములను అన్నింటిని అమ్మేస్తోంది. మంచి ధరకోసం అమ్మకానికి జోరుగా ప్రచారం చేస్తోంది. ఎన్నారైలు అయితే డబ్బులు బాగా కుమ్మరిస్తారని.. వేలం వేసే బ్రోకరేజీ సంస్థ ఎన్బీసీసీ ద్వారా […]

Written By: Srinivas, Updated On : April 7, 2021 1:46 pm
Follow us on


ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని చేయాలనుకున్న విశాఖలో ముందుగా భూముల్ని అమ్మేస్తోంది. రాజధాని చేయాలనుకున్నప్పుడు అక్కడ లెక్కలేనన్ని భూముల అవసరాలు ఉంటాయి. వాటికోసం ప్రభుత్వ భూములు ఏమైనా ఉంటే ముందునుంచే జాగ్రత్త చేసుకుంటారు. కానీ ఏపీ సర్కారు మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో అక్కడకు రాజధాని తరలించకముందే.. అందుబాటులో ఉన్న విలువైన భూములను అన్నింటిని అమ్మేస్తోంది. మంచి ధరకోసం అమ్మకానికి జోరుగా ప్రచారం చేస్తోంది. ఎన్నారైలు అయితే డబ్బులు బాగా కుమ్మరిస్తారని.. వేలం వేసే బ్రోకరేజీ సంస్థ ఎన్బీసీసీ ద్వారా పెద్ద ఎత్తున ఎలక్ర్టానికి మేయిళ్ల ప్రమోషన్ చేస్తున్నారు.

వీటిని అందుకున్న ఎన్నారైలు.. ముక్కుమీద వేలు వేసుకోవాల్సి వస్తోంది. లూటీకి ఇచ్చిన స్థలం సహా 18 ఆస్తులకు ఫర్ సేల్ బోర్డు.. ఆగనంపూడి, ఫకిర్ టకియా ప్రాంతాల్లోని ఐదు స్థలాలతో పాటు బీచ్ రోడ్డు లో ఉన్న మరో స్థానాన్ని వేలానికి పెట్టారు. ఈ ఐదు ప్రాంతాల్లో ఉన్న స్థలాలు అన్ని కలుపుకుంటే.. ఎకరం.. అర ఎకరంలోపే ఉంటాయి. దీని విలువ నాలుగైదు కోట్ల మధ్యనే ఉంటుంది. కానీ బీచ్ లో వేలానికి పెట్టిన స్థలం మాత్రం పదమూడున్నర ఎకరాలు ఉంటుంది. ఇది అత్యంత విలువైంది.దీని విలువ రూ.1452 కోట్లు. ఇవి కాకుండా మరిన్ని స్థలాలు వేలానికి పెట్టారు.

బీచ్ రోడ్డులోని పదమూడున్నర ఎకరాల స్థలంలో ప్రపంచంలోనే అతిపెద్ద మాల్ కం కన్వెన్షన్ సెంటర్ కట్టాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రంగంలో ప్రసిద్ధి చెందిన లూలూ సంస్థతో ఒప్పందం సైతం కుదుర్చుకుంది. వైసీపీ ప్రభుత్వం రాగానే ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. లూలును గెంటేసింది. ఎన్బీసీసీ సంస్థ ఆయా భూములు.. స్థలాల ఫొటోలు.. లే అవుట్ కాపీలు.. ఇతర వివరాలు తెలిపేలా ఫర్ సేల్ బోర్డు పెట్టేసింది. వేలానికి తేదీ నిర్ణయిచింది. వేలంలో పాల్గొనేవారి నుంచి ముందస్తు డిపాజిట్ కూడా సేకరిస్తోంది.

విశాఖలో అతిపెద్ద పరిశ్రమలు తీసుకుని వస్తారని అక్కడి ప్రజలు ఆశిస్తే.. రాజధాని పేరుతో విలువలు పెంచి ప్రభుత్వం భూములను అమ్మేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంఘటన విశాఖ వాసులను విస్మయానికి గురి చేస్తోంది. ఇప్పటికే రావాల్సిన పరిశ్రమలను బయటకు పంపించి.. ఇప్పుడు భూములను అమ్మేస్తూ.. ఈ ప్రభుత్వం విశాఖను అభివృద్ధి చేస్తుందా..? లేదా.. అంతర్గత ఎజెండాతో ఇంకేమైనా వ్యూహం అమలు చేస్తుందా..? అన్న అనుమానాలను సామాన్య ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.