Homeఎంటర్టైన్మెంట్Pandu Master Accident: 'ఢీ' ఫేమ్ 'పండు మాస్టర్' కి ఘోర రోడ్డు ప్రమాదం.. తీవ్రగాయాలు.....

Pandu Master Accident: ‘ఢీ’ ఫేమ్ ‘పండు మాస్టర్’ కి ఘోర రోడ్డు ప్రమాదం.. తీవ్రగాయాలు.. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..

Pandu Master Accident: ఈటీవీ లో ప్రసారం అయ్యే ‘ఢీ ‘ డ్యాన్స్ రియాలిటీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాయించుకున్న పండు మాస్టర్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురి అవ్వడం ఆయన అభిమానులను అత్యంత బాధకు గురి చేస్తోంది. విశాఖ పట్నం ఆనందపురం సమీపం లో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. తగరపు వలస అమ్మవారి ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన డ్యాన్స్ ప్రోగ్రాం ఈవెంట్ ని ముగించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణం మధ్యలో తన టీం కి చెందిన ఒక సభ్యుడు అస్వస్థతకు గురి అవ్వడం తో పండు మాస్టర్ తన కారు ని ఆపాల్సి వచ్చింది. ఆ సమయం లో కారు నుండి బయటకు దిగి , పండు మాస్టర్ రోడ్డు మీద నిల్చొని ఉన్నాడు. అదే సమయం లో ఒక కోళ్ల వ్యాన్మ్ అదుపు తప్పిపోయి ఆగి ఉన్న పండు మాస్టర్ కారు ని ఢీ కొట్టింది.

ఆ కారణం చేత పక్కనే ఉన్నటువంటి పండు మాస్టర్ కి కూడా తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి వెంటనే పండు మాస్టర్ ని సమీపం లో ఉన్న హాస్పిటల్ లో చేర్పించారు.ప్రస్తుతం పండు మాస్టర్ కి వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. పోలీసులు కోళ్ల వ్యాన్ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బుల్లితెర ద్వారా పండు మాస్టర్ సంపాదించుకున్న క్రేజ్ మామూలుది కాదు. అద్భుతమైన డ్యాన్స్ తో పాటు , తన కామెడీ టైమింగ్ తో కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈటీవీ లో ఆయన ఒక పక్క ఢీ షో లో టాప్ కంటెస్టెంట్ గా కొనసాగుతూనే , మరో పక్క ఎంటర్టైన్మెంట్ షోస్ లో కూడా రెగ్యులర్ గా కనిపిస్తున్నాడు.

ప్రస్తుతం నడుస్తున్న ‘ఢీ’ షో లో పండు మాస్టర్ టైటిల్ విన్నింగ్ రేస్ లో కూడా ఉన్నాడు. ఈ ఏడాది గ్రాండ్ గా మొదలు అవ్వబోయే బిగ్ బాస్ సీజన్ 10 లో కూడా ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క సినిమా అవకాశాలు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి.ఇలాంటి సమయం లో పండు మాస్టర్ కి ఇలాంటి ప్రమాదం జరగడం దురదృష్టకరం. ప్రస్తుతానికి అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి చెప్పలేని స్థాయిలోనే ఉంది. ఆయన సంపూర్ణమైన ఆరోగ్యం తో బయటకు రావాలని , ఎప్పటి లాగానే తిరుగులేని ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిద్దాం.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version