Chiranjeevi Politics Impact: మెగాస్టార్ చిరంజీవి గత 50 సంవత్సరాలు నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేయనటువంటి పాత్ర లేదు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించిన ఆయన తన సత్తా ఏంటో ప్రస్తుతం తెలుగు సినిమా ప్రేక్షకులందరికి చూపిస్తున్నాడు. ఇప్పటికే ఆయన నుంచి వచ్చిన సినిమాలు అతన్ని టాపిక్ లెవల్లో నిల్చోబెట్టాయి. అలాంటి హీరో ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో కొంతవరకు డీలా పడిపోయాడు. ఇక రీసెంట్ గా చేసిన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమా అతనికి భారీ విజయాన్ని కట్టబెట్టినప్పటికి ఆ సినిమా ఆయన రేంజ్ కి తగ్గ సక్సెస్ అయితే కాదని చాలామంది చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి 2008 వ సంవత్సరంలో ప్రజారాజ్యం అనే రాజకీయ పార్టీని పెట్టి రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. మొత్తానికైతే ఆ పార్టీతో ఆయన సీఎం గా అవతరిస్తాననే ఆలోచన చేసినప్పటికి ఆయన అనుకున్న రేంజ్ లో సీట్లైతే రాలేదు.
దాంతో ఆయన కొంతవరకు డీలా పడిపోయాడు. ఇక మొత్తానికైతే చిరంజీవి చేసిన ఆ ఒక్క మిస్టేక్ వల్ల ఆయన దాదాపు 10 సంవత్సరాలపాటు ఇండస్ట్రీ నుంచి దూరంగా ఉంటూ రాజకీయానికి సంబంధించిన పనులు చూసుకుంటూ వచ్చాడు. ఇక అప్పటినుంచి చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చినా కూడా ఆయనకు సరైన సక్సెస్ రావడం లేదు.
నిజానికి చిరంజీవి రాజకీయరంగ ప్రవేశం చేయడానికి ముందు వరకు కూడా ఆయన నెంబర్ వన్ హీరోగా కొనసాగాడు. అలాంటి చిరంజీవి అంత మంచి హోదాను వదులుకొని 10 సంవత్సరాలపాటు ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్లిపోవడంతో అతని క్రేజ్ పడిపోయింది. అటు రాజకీయ రంగంలో చేసిన మిస్టేక్స్ వల్ల ఆయన పర్సనల్ విషయాల్లో కూడా చాలా వరకు దెబ్బ పడింది. దానివల్ల ఇటు జనాల్లో చాలా వరకు నమ్మకాన్ని కోల్పోయారు. దాంతో ఆయన ఏం చేయాలో తెలియని సందిగ్ధ పరిస్థితిలో పడిపోయి మొత్తానికైతే ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో సక్సెస్ ని సాధించి ప్రేక్షకులందరికి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాడు.
రాజకీయ రంగ ప్రవేశం చేయడం వల్లే తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో ఎవరు అనే విషయం మీద ఇప్పటివరకు సరైన క్లారిటీ అయితే లేకుండా పోయింది. ఒకవేళ తను ఇండస్ట్రీ లోనే ఉండి ఉంటే ఇలానే సినిమాలు చేసుకుంటూ వస్తే మాత్రం ఇప్పటి వరకు అతనే నెంబర్ వన్ హీరోగా ఉంవారంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…
