https://oktelugu.com/

మద్యం పోయలేదని స్నేహితుడిని చంపేశాడు.. ఎక్కడంటే..?

ఈ మధ్య కాలంలో మద్యం మత్తులో విచక్షణ లేకపోవడం వల్ల ప్రాణాలు తీస్తున్న ఘటనలు దేశంలో పెరిగిపోతున్నాయి. తాజాగా మద్యం మరో నిండు ప్రాణాన్ని బలిగొంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోకు సమీపంలో ఉన్న శామ్లీలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన గ్లాసులో మద్యం పోయలేదని ఒక వ్యక్తి తన స్నేహితుడిని పదునైన ఆయుధంతో కిరాతకంగా చంపేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే శామ్లీకి చెందిన జస్బిర్, కృష్ణపాల్ స్నేహితులు, సరదాగా అప్పుడప్పుడూ వీళ్లిద్దరూ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 26, 2020 6:23 pm
    Follow us on

    ఈ మధ్య కాలంలో మద్యం మత్తులో విచక్షణ లేకపోవడం వల్ల ప్రాణాలు తీస్తున్న ఘటనలు దేశంలో పెరిగిపోతున్నాయి. తాజాగా మద్యం మరో నిండు ప్రాణాన్ని బలిగొంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోకు సమీపంలో ఉన్న శామ్లీలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన గ్లాసులో మద్యం పోయలేదని ఒక వ్యక్తి తన స్నేహితుడిని పదునైన ఆయుధంతో కిరాతకంగా చంపేశాడు.

    పూర్తి వివరాల్లోకి వెళితే శామ్లీకి చెందిన జస్బిర్, కృష్ణపాల్ స్నేహితులు, సరదాగా అప్పుడప్పుడూ వీళ్లిద్దరూ కలిసి మద్యం తాగేవారు. అలా గురువారం రోజు కూడా జస్బిర్, కృష్ణపాల్ మద్య్ం బాటిళ్లు తెచ్చుకుని మద్యం తాగారు. అయితే కృష్ణపాల్ జస్బిర్ కంటే వేగంగా మద్యం తాగడంతో అతని బాటిల్ లో మందు అయిపోయింది. రాత్రి సమయం కావడంతో మళ్లీ మద్యం కొనుగోలు చేయాలని అనుకున్నా కొనే పరిస్థితి లేదు.

    మద్యం ఎలాగైనా తాగాలని అనుకున్న కృష్ణపాల్ జస్బిర్ ను తన బాటిల్ లోని మద్యాన్ని గ్లాస్ లో పోయాలని కోరాడు. అయితే జస్బిర్ మాత్రం అందుకు అంగీకరించలేదు. వేగంగా తాగడం వల్లే మందు అయిపోయిందని తన బాటిల్ లోని మందు అడగవద్దని జస్బిర్ కోరాడు. జస్బిర్ అలా చెప్పడంతో కోపం తెచ్చుకున్న కృష్ణపాల్ అతనితో గొడవకు దిగాడు. మద్యం మత్తులో ఒకరితో మరొకరు గొడవ పడ్డారు.

    ఆ తరువాత కృష్ణపాల్ పదునైన ఆయుధంతో జస్బీర్ ను హత్య చేశాడు. హత్య చేసిన తరువాత ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కృష్ణపాల్ ను అదుపులోకి తీసుకోగా మద్యం పోయకపోవడం వల్లే అతనిని చంపేశానని అంతకు మించి మరే కారణం లేదని కృష్ణపాల్ పోలీసులకు తెలిపారు.