కేంద్రంతో చర్చలకు ఎల్లప్పుడూ సిద్ధమే..!

కేంద్రంలోని మోదీ సర్కార్ వ్యవసాయ సంస్కరణ పేరిట ఇటీవల కొత్త చట్టాలను తీసుకొచ్చింది. ఈ చట్టాలకు రైతుల మేలు కోసమేనని కేంద్రం వాదిస్తుండగా రైతులు మాత్రం తమకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Also Read: మొబైల్ ఫోన్లు వాడేవాళ్లకు శుభవార్త.. ఓటీపీ కష్టాలు తీరినట్లే..? ఈక్రమంలోనే కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు కొద్దిరోజులుగా ఆందోళన చేపడుతున్నారు. వణికించే చలిలోనూ రైతులు నిరసనలు చేపడుతుండటంతో వారికి అన్నివర్గాల నుంచి పెద్దఎత్తున మద్దతు […]

Written By: Neelambaram, Updated On : December 26, 2020 8:22 pm
Follow us on

కేంద్రంలోని మోదీ సర్కార్ వ్యవసాయ సంస్కరణ పేరిట ఇటీవల కొత్త చట్టాలను తీసుకొచ్చింది. ఈ చట్టాలకు రైతుల మేలు కోసమేనని కేంద్రం వాదిస్తుండగా రైతులు మాత్రం తమకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: మొబైల్ ఫోన్లు వాడేవాళ్లకు శుభవార్త.. ఓటీపీ కష్టాలు తీరినట్లే..?

ఈక్రమంలోనే కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు కొద్దిరోజులుగా ఆందోళన చేపడుతున్నారు. వణికించే చలిలోనూ రైతులు నిరసనలు చేపడుతుండటంతో వారికి అన్నివర్గాల నుంచి పెద్దఎత్తున మద్దతు లభిస్తోంది.

రైతు సంఘాలతో పలుమార్లు చర్చలు జరిపినా ఎటువంటి ఫలితం రావడం లేదు. దీంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంటుంది. డిసెంబర్ 25న ప్రధానీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడి దీక్షలు విరమింపజేస్తారని ప్రచారం జరిగింది.

కానీ అలాంటిదేమీ జరుగకపోవడం శోచనీయంగా మారింది. అయితే కేంద్రం మరోసారి రైతులతో చర్చలకు సిద్ధమవుతోంది. ఈమేరకు కేంద్రం 40రైతులకు సంఘాలకు లేఖలు రాసింది.

Also Read: చెంచాగిరి చేయాల్సిన అవసరం లేదంటున్న కాంగ్రెస్ నేత..!

రైతులు సైతం ఈనెల 29 ఉదయం 11గంటలకు కేంద్రంతో చర్చలకు సిద్ధమేనని ప్రకటించారు. తాము కేంద్రంతో చర్చలు జరిపేందుకు ఎప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశాయి.

కొత్త సాగు చట్టాలు.. కనీస మద్దతు ధరకు హామీపై విద్యుత్ బిల్లు-2020 ముసాయిదాలో మార్పులపై కేంద్రంతో చర్చించేందుకు తాము సిద్ధమేనని రైతులు సంఘాలు పేర్కొన్నాయి.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్