Cheetah Daksha’s Death : ప్రకృతికి విరుద్ధంగా ఏ పని చేసినా దాని అంతిమ ఫలితం వినాశనానికే దారితీస్తుంది.. చరిత్రలో ఇప్పటివరకు జరిగిన అనేక విషయాలు దీనిని ధ్రువపరిచాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. కానీ ఆ ప్రమాదంలో ఒక జంతువు చనిపోయింది. ఆకలి, నిద్ర ఎలాగో.. ఈ భూమి మీద జంతువులకు శృంగారం కూడా అలాంటిదే. కానీ ఆ శృంగారం పద్ధతిగా చేస్తే బాగుంటుంది. పద్ధతి తప్పితే ప్రాణాలు పోతాయి.ఇప్పుడు ఈ విషయాన్ని ఒక చిరుత తన మరణం ద్వారా అటవీ శాఖ అధికారులకు వాస్తవంలో చూపెట్టింది. “రెండు మగ చీతాలతో.. ఆడ చీతా శృంగారం” తీవ్రంగా గాయపడి ఆడ చీతా కన్నుమూత” సోషల్ మీడియాను ఊపేస్తున్న వార్త ఇది. వాస్తవానికి రెండు మగ చీతాలతో ఒక ఆడ చీతా శృంగారం చేయడం అనేది వినడానికి వింతగా ఉన్నప్పటికీ.. జంతు ప్రదర్శనశాల అధికారులే ఆ దిశగా ఏర్పాట్లు పూర్తి చేశారు. కాకుంటే ఆ సమయంలో రెండు మగ చీతాలు రెచ్చిపోవడంతో ఆడ చీతా గాయాలపాలై కన్ను మూసింది.
మధ్యప్రదేశ్లో ఘటన
ప్రాజెక్ట్ చీతాలో భాగంగా గత ఏడాది 8 చీతాలను నమీబియా దేశం నుంచి భారతదేశానికి తీసుకొచ్చారు. అయితే ఇందులో ఇప్పటివరకు రెండు చీతాలు మృతి చెందాయి. ఈ నేపథ్యంలోనే నమీబియా నుంచి తీసుకొచ్చిన దక్ష అనే చీతా కూడా కన్ను మూయడంతో ఇప్పటివరకు మృతి చెందిన చీతాల సంఖ్య మూడుకు చేరుకుంది. అయితే రెండు మగ చీతాలతో జత కట్టిన సమయంలో గాయపడిన దక్ష కొద్ది గంటల్లోనే మృతి చెందింది. గాయపడిన దక్షకు అటవీశాఖ అధికారులు చికిత్స చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
గొడవ జరిగింది
ఆడ చీతా తో సంభోగ సమయంలో వాయు, అగ్ని అనే మగ చీతాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి.. ఆ సమయంలో దక్ష తీవ్రంగా గాయపడింది. అటవీ శాఖ అధికారులు ప్రధమ చికిత్స అందించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అయితే అధికారులు చీతాల సంఖ్య పెంచేందుకు దక్ష సంభోగం గురించి వన్యప్రాణి అధికారులు, నిపుణులు ఏప్రిల్ 30న ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దక్ష అనే ఆడ చీతాను వాయు, అగ్ని అనే రెండు మగ చీతాలు కలిసేలా చూడాలని ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారం మే 6 న ఎన్ క్లోజర్ నెంబర్ 1లో ఉన్న దక్షను బోమా ఎన్ క్లోజర్ లో వాయు, అగ్ని అనే రెండు మగ చీతాలతో సంభోగం కోసం విడుదల చేశారు. ఈ ప్రక్రియలో మగ చీతాలు హింసాత్మకంగా ప్రవర్తించాయి. ఈ క్రమంలో ఆడ చీతాకు గాయాలైనట్టు తెలుస్తోంది.. అయితే ఇది చాలా చిన్న విషయమని అటవీశాఖ అధికారులు కొట్టి పారేస్తున్నారు