https://oktelugu.com/

Custody pre-release event : ‘కస్టడీ’ చెన్నై ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగ చైతన్య కి చుక్కలు చూపించిన సమంత ఫ్యాన్స్

నాగ చైతన్య కూడా తమిళం అద్భుతంగా మాట్లాడాడు. అయితే నాగ చైతన్య స్పీచ్ ఇస్తున్న సమయం లో ఆడియన్స్ లో ఒక గుంపు గా కూర్చున్న కొంతమంది, సమంత అంటూ బిగ్గరగా నినాదాలు చెయ్యడం ప్రారంభించారు.

Written By:
  • NARESH
  • , Updated On : May 10, 2023 / 11:30 PM IST
    Follow us on

    Custody pre-release event : అక్కినేని నాగచైతన్య హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కస్టడీ’ 12 వ తేదీన తెలుగు మరియు తమిళం బాషలలో ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ టీం ప్రొమోషన్స్ లో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది.రీసెంట్ గానే తెలుగు లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరుపుకున్న ఈ చిత్రం, తమిళం లో కూడా భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరుపుకుంది.ఈ ఈవెంట్ కి మూవీ యూనిట్ మొత్తం హాజరైంది.

    నాగ చైతన్య కూడా తమిళం అద్భుతంగా మాట్లాడాడు. అయితే నాగ చైతన్య స్పీచ్ ఇస్తున్న సమయం లో ఆడియన్స్ లో ఒక గుంపు గా కూర్చున్న కొంతమంది, సమంత అంటూ బిగ్గరగా నినాదాలు చెయ్యడం ప్రారంభించారు. కానీ నాగ చైతన్యు ఆ నినాదాలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకంటూ ముందుకు పోతున్నాడు.

    సమంత కి తెలుగుతో పాటుగా తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే, ఆమె అభిమానులు విడాకులు ఇచినప్పటి నుండి నాగ చైతన్య పై చాలా కోపంగా ఉన్నారు. సోషల్ మీడియా లో వీళ్లిద్దరి అభిమానులు తరచూ ఫ్యాన్ వార్స్ చేసుకుంటూనే ఉంటారు,అందులో భాగంగానే ఇలా నాగ చైతన్య మాట్లాడుతున్నప్పుడు ఆయనని అవమానించాలి అనే ఉద్దేశ్యం తో సమంత నినాదాలు చేసారని టాక్.

    ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అవుతుంది.మరోపక్క సమంత గురించి నాగ చైతన్య కస్టడీ ఇంటర్వ్యూస్ లో చాలా గొప్పగా మాట్లాడుతాడు, సమంత మంచి అమ్మాయి అని, ఆమెకి అన్నీ మంచి మాత్రమే జరగాలని చెప్పుకొచ్చాడు. కానీ సమంత ఫ్యాన్స్ ఇంకా నాగ చైతన్య పై ఆగ్రహం తగ్గించలేదు. రాబోయే రోజుల్లో అయిన తగ్గుతుందో లేదో చూడాలి.