Lawrence Bishnoi Gang: మనదేశంలో పంజాబ్ రాష్ట్రంలో పరిస్థితులు చాలా విచిత్రంగా ఉంటాయి. ఇక్కడ మాదకద్రవ్యాలు సర్వసాధారణంగా లభిస్తుంటాయి. యువత కూడా దూకుడుగా ఉంటుంది. పైగా ప్రభుత్వాలు కూడా అక్కడి గ్యాంగులకు భయపడుతుంటాయి. కొన్ని చీకటి శక్తులు అక్కడి ప్రభుత్వాలను తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఆ శక్తులు చెప్పిందే అక్కడ వేదంగా ఉంటుంది. కాదుకూడదని అక్కడి ప్రభుత్వాలు ఏమైనా చేస్తే మనగడ సాధ్యం కాదు. పైగా జరగకూడని దారుణాలు జరుగుతుంటాయి. ఊహించని విషాదాలు చోటు చేసుకుంటాయి.
పంజాబ్ లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కు ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఈ గ్యాంగ్ హిందూ సంస్కృతిని కాపాడేందుకు ఎక్కడిదాకైనా వెళ్తుంది. లారెన్స్ బిష్ణోయ్ పేరుకు జైల్లో ఉన్నప్పటికీ.. అతడు జైలు ద్వారానే అనేక రకాల కార్యకలాపాలు సాగిస్తుంటాడు. పంజాబ్ రాష్ట్రంలో తాము అత్యంత ప్రేమగా చూసుకునే జంతువులను హతమార్చిన వ్యక్తులను అంతం చేయించాడు. మాదకద్రవ్యాల వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులను కూడా తుద ముట్టించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే జైల్లో ఉంటూనే లారెన్స్ బిష్ణోయ్ ఎన్నో దారుణాలకు పాల్పడ్డాడు. ఆ మధ్య ముంబై ప్రాంతంలో పేరుపొందిన ఓ నటుడు ఇంటి వద్ద లారెన్స్ బిష్ణోయ్ అనుచరులు చేసిన సంచలనం అంతా ఇంతా కాదు.
ఇక తాజాగా పంజాబ్లో కబడ్డీ ఆటగాడు గురువిందర్ సింగ్ ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అంతం చేసింది. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.. కేవలం గురువిందర్ సింగ్ మాత్రమే కాక.. గడచిన పది సంవత్సరాల కాలంలో పదిమంది కబడ్డీ ప్లేయర్లను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ చేసింది. టార్గెట్ చేయడం మాత్రమే కాదు వారిని భూమ్మీద లేకుండా చేసింది.. 2016 నుంచి పదిమంది కబడ్డీ ప్లేయర్లను అంతం చేయడానికి వెనుక కారణాలను కూడా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బయట పెట్టింది. వీరంతా కూడా చీకటి దందాలు, మాదకద్రవ్యాల వ్యాపారాలు, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలోనే ఈ శిక్ష విధించామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది..
“మీ దారులు పంజాబ్ చరిత్రకు వ్యతిరేకంగా ఉన్నాయి. మీరంతా కూడా నేరమయ కార్యకలాపాలలో బిజీగా ఉన్నారు. మీరు చేస్తున్న దానివల్ల పంజాబ్ చరిత్ర మొత్తం నాశనం అవుతోంది.. అందువల్ల మీకు సరైన శిక్ష విధించక తప్పడం లేదు.. ఇప్పటికైనా మీరు మీ దారి మార్చుకోవాలి.. ఈ తరహా వ్యక్తులు తమ ధోరణి వేరే వైపు మళ్ళించుకోవాలి.. లేనిపక్షంలో పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని” లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. దీంతో పంజాబ్ రాష్ట్రంలో నేరమయ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారంతా భయపడుతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని వణికి పోతున్నారు.