This Week Movie Releases: ప్రతి వారం చాలా మంది మేకర్స్ తమ సినిమాలను రిలీజ్ చేస్తూ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు…ఇందులో కొంతమంది సక్సెస్ లను సాధిస్తే మరి కొంతమంది డిజాస్టర్లను మూట గట్టుకుంటున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ పెను ప్రభంజనాలను క్రియేట్ చేస్తుంటే మరికొంత మాత్రం తెలుగులోనే గొప్ప సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు… ఇక గతవారం ‘బాహుబలి ది ఎపిక్’, మాస్ జాతర రెండు సినిమాలు వచ్చినప్పటికి అందులో మా జాతర డిజాస్టర్ కాగా, బాహుబలి ది ఎపిక్ మాత్రం మిక్స్డ్ టాక్ తో ముందుకు సాగుతోంది. ఇక ఈ వారంలో ముఖ్యంగా 3 సినిమాల మధ్య భారీ పోటీ ఉంది. రష్మిక మందాన మెయిన్ లీడ్ లో వస్తున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ఉంది. ఈ సినిమాతో రష్మిక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలను కూడా చేయగలరని ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తోంది…
సుధీర్ బాబు సైతం ‘జటాధర’ సినిమాతో ఈనెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తే ఆయన కూడా టాప్ హీరోగా మారిపోతాడు. లేకపోతే మాత్రం తన మార్కెట్ ను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు…
‘మసుద’ సినిమాతో నటుడిగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్న నటుడు తిరువీర్…ఈయన మెయిన్ లీడ్ లో చేస్తున్న ‘ప్రీ వెడ్డింగ్ షో’ సినిమా కూడా ఈ వారం రిలీజ్ అవుతోంది. ఇక ఈ సినిమాతో మంచి విజయాన్ని అనుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు… ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి చాలా మంచి టేస్ట్ ఉంది. ఆయన ఎంచుకున్న సబ్జెక్టులు ఆయనకు గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెడుతున్నాయి…
ఇక ‘ప్రేమిస్తున్నాం ‘ అంటూ ఒక చిన్న సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక దాంతోపాటుగా డబ్బింగ్ సినిమాలు సైతం ప్రేక్షకురాల ముందుకురావడానికి సిద్ధమవుతున్నాయి. విష్ణు విశాల్ హీరోగా వచ్చిన ఆర్యన్ సినిమా ఈనెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఇక ఈ సినిమాలన్నింటిలో ఏ మూవీ పై చేయి సాధిస్తుందనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…