iyer idly bengaluru krishnan mahadevan : ఏ పని అయినా సరే.. మనకు ఆసక్తి ఉండాలి.. ఆ ఆసక్తితో అద్భుతాలు చేయగలం.. అందలం ఎక్కగలం.. ఇంట్రెస్ట్ లేని పని ‘గానుగ ఎద్దు’ మాదిరిగానే సాగుతుంది. అందులో ఓ ఎదుగు, బొదుగు ఉండదు. బెంగళూరుకు చెందిన కృష్ణన్ మహదేవన్ కూడా తనకు నచ్చని కార్పొరేట్ ఉద్యోగాన్ని అలానే వదిలేశాడు. వాళ్ల అమ్మ ఉమతో కలిసి ఒక ‘ఇడ్లీ సెంటర్’ను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు రోజూ వేలల్లో ఇండ్లీలు అమ్ముతూ లక్షల్లో సంపాదిస్తున్ానడు. విజయవంతంగా ఈ బిజినెస్ రన్ అవుతోంది. ఎంతలా అంటే.. నెలకు ఏకంగా 1.5 టన్నుల బియ్యాన్ని, ఒక టన్ను ఉరద్ పప్పును వాడుతూ బెంగళూరులోని విజ్ఞాన్ నగర్ లోని తన ‘అయ్యర్ ఇడ్లీ’ని కృష్ణన్ ఒక బడా హోటల్ గా తీర్చిదిద్దాడు.

బెంగళూరులో ఇప్పుడు ‘అయ్యర్ ఇడ్లీ సెంటర్’ చాలా ఫేమస్. కేవలం ఇడ్లీ మరియు చట్నీ ఆ రెండింటిని మాత్రమే కృష్ణన్ మహదేవన్ విక్రయిస్తున్నారు. దాదాపు 20 ఏళ్లుగా ఈ రెండు ఐటెమ్స్ తో లాభాలతోపాటు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. అయ్యర్ ఇడ్లీని 2001లో కృష్ణన్ మహదేవన్ వాళ్ల తండ్రి స్థాపించాడు. 2000 సంవత్సరంలో కృష్ణన్ తండ్రి మహదేవన్ ఉద్యోగం కోల్పోవడంతో ఇడ్లీ బండి పెట్టి ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఈ వ్యాపారం కొనసాగించేందుకు ఇంటిల్లిపాది వేకువజామునే లేచి పిండి సిద్ధం చేసేవాళ్లమని.. చాలా కష్టమైన రోజులను గుర్తు చేసుకున్నాడు కృష్ణన్.
Also Read: ‘దాసరి’ డైరెక్షన్‌లో యాంకర్ సుమ హీరోయిన్‌గా చేసిందన్న విషయం మీకు తెలుసా..?
మహదేవన్ ఒక్కడు చేసే ఇడ్లీ పిండి వ్యాపారం నుంచి వచ్చే డబ్బులతోనే ఆ కుటుంబంలోని ఐదుగురు బతకాలి. కష్టంగా సాగుతున్న రోజుల్లో మిత్రులు, శ్రేయోభిలాషుల సూచనతో మహదేవన్ 2001లో ఇడ్లీ సెంటర్ ను ప్రారంభించారు. మొదట్లో ప్రజల నుంచి గుర్తింపు మాత్రం రాలేదు. చాలా నెలల వరకూ ఖర్చులన్నీ పోనూ కేవలం రూ.40 మాత్రమే మిగిలేది. అంటే నెలకు రూ.1200 మాత్రమే. అలా అంచలంచెలుగా ఎదిగారు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ రోజుల్లో పడ్డ కష్టమే గుర్తిస్తోందని కృష్ణన్ తెలిపాడు. బిజినెస్ ను ఎలా నిర్వహించామో తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉందని కృష్ణన్ అంటున్నాడు.
కృష్ణన్ కు చిన్నప్పుడు నాన్న ఇడ్లీ సెంటర్ నడుపుతుంటే అక్కడికి వెళ్లి పనిచేయడం అలవాటు చేసుకున్నాడు. ఈక్రమంలోనే డిగ్రీని, పీజీని పూర్తి చేశాడు. తర్వాత ఫ్రొఫెసర్ గా కాలేజీలో జీవితం ఆరంభించాడు. అనంతరం అతడు ‘గోల్డ్ మన్ సాక్స్ లో ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ టీం’లో చేరాడు. అక్కడ నాలుగేళ్లు ఉద్యోగం చేశాడు.
ఈ క్రమంలోనే 2009లో కృష్ణన్ తండ్రి మహదేవన్ మరణించాడు. వ్యాపార బాధ్యతలు కృష్ణన్ తల్లి ఉమా తీసుకుంది. గోల్డ్ మన్ సాక్స్ లో మంచి ఉద్యోగంలో ఉన్న కృష్ణన్ తన ఉద్యోగాన్ని వదిలి తల్లికి సాయంగా ‘ఇడ్లీ సెంటర్’ నడుపుతానన్నాడు. కానీ ఈ ప్రతిపాదనకు వాళ్ల అమ్మ ఒప్పుకోలేదు. అంతపెద్ద ఉద్యోగం వదిలి ఇడ్లీ షాపుకు రావడం ఏంటని అడ్డుపడింది.
కానీ కృష్ణన్ మాత్రం తల్లికి నచ్చజెప్పి ఆ ఉద్యోగాన్ని వదిలి ఇడ్లీ సెంటర్ బాధ్యతలు తీసుకున్నారు. ఈ బిజినెస్ ను విజయవంతంగా నడిపిస్తున్నారు. ఈ సమయంలోనే కరోనా లాక్ డౌన్ వారికి మంచి లాభాలు తీసుకొచ్చింది. కృష్ణన్ నిర్ణయం పట్ల వాళ్ల అమ్మకు ఉన్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేశాడు. ఇప్పుడు బెంగళూరులోనే ఈ అయ్యర్ ఇడ్లీని ఫేమస్ చేశాడు. రోజూ వేలల్లో ఇడ్లీలు అమ్ముతూ లక్షల్లో సంపాదిస్తున్నాడు.
Also Read: జబర్దస్త్ కమెడియన్ పవిత్ర గురించి ఈ విషయాలు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే?