Son of India: సీనియర్ మోస్ట్ హీరో మోహన్ బాబుగారు హీరోగా నటించిన ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమా రేపు రిలీజ్ కాబోతుంది. పేరులోనే ఈ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పేశారు. అయితే, ఈ సినిమాని ఆల్ రెడీ కొందరు ఇండస్ట్రీ పెద్దలు చూశారు. ఆ పెద్దల ఇన్ సైడ్ టాక్ ఏమిటంటే.. సినిమాలో డైలాగ్స్ అన్నీ గూగుల్ లో కొటేషన్స్ చూసి రాసినట్టు ఉన్నాయట. ఇక సీన్స్ అయితే.. ఇప్పటి వరకు వచ్చిన దేశ భక్తి సినిమాల్లోని సీన్స్ అన్నీ ఈ సినిమాలో ఉంటాయట.

ఇక మోహన్ బాబు గారి నటన విషయానికి వస్తే.. పాపం ఆయన గొంతు అరిగిపోయేలా పెద్ద పెద్దగా అరిచి గోల చేశారట. కానీ, పేస్ లో ఎక్స్ ప్రెషన్స్ మాత్రం కనబడలేదు అంటున్నారు. ఇక పెరిగిన వయసు కూడా చాలా క్లారిటీగా తెలిసిపోతుందట. అలాగే విగ్గు కూడా ఒక్కో సీన్ లో ఒక్కోలా ఉంటుందని తెలుస్తోంది. మొత్తమ్మీద ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమాలో మ్యాటర్ లేదు అని తేల్చి చెప్పారు.
Also Read: జబర్దస్త్ కమెడియన్ పవిత్ర గురించి ఈ విషయాలు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే?
ఎలాగూ సినిమా రేపు రిలీజ్ అవుతుంది. అన్నట్టు దేశ భక్తి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకి డైలాగ్ రైటర్ డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించాడు. డైమండ్ రత్నబాబు అంటేనే.. ఇండస్ట్రీలో బిల్డప్ మాస్టర్ అని పేరు ఉంది. ఆవగింజ అంత మ్యాటర్ ఉంటే.. పుచ్చకాయ అంత ఎక్కువ చేసి చెబుతాడు అని బలమైన ముద్ర ఉంది.
సో.. డైమండ్ రత్నబాబు సినిమా పై అందుకే ఎలాంటి అంచనాలు లేకుండా పోయాయి. దీనికితోడు మనోడు తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో కూడా బోలెడు బిల్డప్ ముచ్చట్లు షురు చేసిండు. ఇంతకీ ఏమిటి ఆ ముచ్చట్లు అంటే.. ‘నాలుగు ఫైట్లు, ఐదు సాంగ్స్ అంటూ ఒక కమర్షియల్ ప్యాకేజ్ రూపంలో నేను సినిమా చేయలేదు. నేను ఓ ప్రయోగాత్మకమైన చిత్రం చేశాను.

ఇక క్లైమాక్స్ లో పుణ్యభూమినాదేశం, రాయలసీమరామన్నచౌదరి లాంటి పవర్ ఫుల్ డైలాగులు నా సినిమాలో ఉండనున్నాయి. ఇక ఇళయరాజా లాంటి గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి పని చేయడం నా అదృష్టం అంటూ ఈ దర్శకుడు చెప్పుకొచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.
Also Read: దాసరి’ డైరెక్షన్‌లో యాంకర్ సుమ హీరోయిన్‌గా చేసిందన్న విషయం మీకు తెలుసా..?
[…] Also Read: ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమా ఎలా ఉందంటే.. ? […]
[…] OKtelugu MovieTime: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే..సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై అనుష్క శెట్టి సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘అవకాశాలు ఇస్తామని చెప్పి హీరోయిన్లను లోబర్చుకునే సంస్కృతి తెలుగు పరిశ్రమలో ఉంది. నేను కూడా అలాంటివి చూశాను. ఇది కేవలం తెలుగులోనే కాదు.. ప్రతి ఇండస్ట్రీలో ఉంది. అయితే నేను పరిశ్రమలోకి వచ్చినప్పటి నుంచి చాలా సూటిగా.. నిక్కచ్చిగా మాట్లాడుతున్నాను. అందుకే ఇలాంటి పరిస్థితి నాకు ఎదురుకాలేదు’ అని స్వీటీ వివరించింది. […]