https://oktelugu.com/

మసకబారుతున్నమోదీ చరిష్మా?

ప్రధానిగా నరేంద్రమోడీ ఏడేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. గతంలో ఎన్టీఏకు నాయకత్వం వహించిన ప్రధాని వాజ్ పేయికి ఇన్నేళ్లు పాలించే  అదృష్టం దక్కలేదు. ఇప్పుడు దేశంలో, ప్రపంచంలో మెరుగైన నేతగా మోడీ పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పాలనలో చేయలేని ఎన్నో మొండి సమస్యలు పరిష్కరించాడు. సంస్కరణాలకు బాటలు వేశాడు.. ఏడేళ్ల పాలనలో జీఎస్టీ, నోట్ల రద్దు, బ్యాంకింగ్ సంస్కరణలు, కశ్మీర్ సమస్య పరిష్కారం, చైనా, పాక్ లతో ఢీ అంటే ఢీ అని భారతీయుల మనసు దోచుకున్నారు.  […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 2, 2021 10:45 am
    Follow us on

    ప్రధానిగా నరేంద్రమోడీ ఏడేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. గతంలో ఎన్టీఏకు నాయకత్వం వహించిన ప్రధాని వాజ్ పేయికి ఇన్నేళ్లు పాలించే  అదృష్టం దక్కలేదు. ఇప్పుడు దేశంలో, ప్రపంచంలో మెరుగైన నేతగా మోడీ పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పాలనలో చేయలేని ఎన్నో మొండి సమస్యలు పరిష్కరించాడు. సంస్కరణాలకు బాటలు వేశాడు.. ఏడేళ్ల పాలనలో జీఎస్టీ, నోట్ల రద్దు, బ్యాంకింగ్ సంస్కరణలు, కశ్మీర్ సమస్య పరిష్కారం, చైనా, పాక్ లతో ఢీ అంటే ఢీ అని భారతీయుల మనసు దోచుకున్నారు.  కానీ కరోనా వైరస్ తొలి వేవ్ ను ఎదుర్కొన్న మోడీ రెండో వేవ్ ను మాత్రం ఎదుర్కోలేక అప్రతిష్టపాలయ్యారు.

    భారతీయ జనతా పార్టీ మూల సిద్దాంతాల ప్రాతిపదికన పరిపాలన సాగించడానికి మోదీ ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి పౌరస్మ్రతి మినహా మిగిలిన పార్టీ ఎజెండాను సాకారం చేయగలిగారు. అయోధ్య రామాలయ నిర్మాణం, జమ్ముకాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు వంటి అంశాలు ఏ ఇతర ప్రభుత్వంలోనూ సాధ్యమయ్యేవి కావు. నిరుద్యోగం దేశంలో ఎన్నడు లేని స్థాయికి చేరింది. మేకిన్ ఇండియా వంటి కార్యక్రమాలు కరోనాతో ఆగిపోయాయి. పేఆరోగ్యం, విద్య మరింత ఖరీదైపోయాయి. మౌలిక వసతులను పూర్తిగా గంపగుత్తగా ప్రైవేటుకు కట్టబెట్టే ప్రయత్నాలే సాగడం విమర్శలకు తావిస్తోంది.

    ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయాలు కొన్ని హిట్ కాగా కొన్ని విమర్శలు ఎదుర్కొన్నాయి. కానీ ఎక్కడా వెనక్కి తగ్గకుండా మోడీ ముందుకెళుతున్నాడు. నోట్ల రద్దు అందుకు ఒక ఉదాహరణ. అసంఘటిత రంగం అస్తవ్యస్తమైపోయింది. నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ప్రభుత్వం ఏ రకమైన చర్యలు చేపట్టకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత ఎదురైంది. ప్రజా జీవితాలతో ప్రయోగాలు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం కాస్త సాహసమే చేసిందనే చెప్పాలి.

    రాష్ట్రాలతో కూడా మోడీ సర్కార్ కు సత్సంబంధాలు లేకుండా పోతున్నాయి.. వాజ్ పేయి హయాంలో రాష్ట్రాలతో సుహృద్భావ సంబంధాలు నెలకొల్పడానికి ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ప్రస్తుతం మోదీ అన్ని రాష్ట్రాలతో కయ్యానికి వైరాన్ని కొనితెచ్చుకుంటున్నారు..ప్రధాని ప్రవర్తనపై   ప్రతిపక్షాలు గగ్గోలు పె డుతున్నాయి.  టీకాల కొనుగోలులో రాష్ట్రాలతో విభేదాలో కొనసాగుతున్నాయి. ఈ ఆపత్కాలాన్ని సరిచేరి రాబోయే మూడేళ్లలో మోడీ మళ్లీ పుంజుకునేందుకు అడుగులు వేస్తున్నాయి. వాజ్ పేయి తర్వాత ఆయనకంటే బలంగా.. పాలనలో దూకుడుగా మోడీ ముందుకెళ్తున్నాడని పేరు తెచ్చుకున్నాడు.