టీకా డోసులపై ఆందోళన వద్దు

కరోనా టీకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం మొద్దు నీద్ర వీడడం లేదు. అందరికీ వ్యాక్సిన్లు వేయంచాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ఫలితంగా వైరస్ తన ప్రభావాన్ని చూపిస్తోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఫలితంగా ప్రజలకు రక్షణ లేకుండా పోతోంది. ప్రజలందరికీ టీకాలు వేయించాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. టీకా విధానంలో వేర్వేరు డోసుల సమర్థత ఇంకా శాస్ర్తీయంగా రుజువు కానందున ప్రస్తుతానిక వ్యాక్సిన్ మిక్సింగ్ అనే […]

Written By: Srinivas, Updated On : June 2, 2021 10:06 am
Follow us on

కరోనా టీకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం మొద్దు నీద్ర వీడడం లేదు. అందరికీ వ్యాక్సిన్లు వేయంచాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ఫలితంగా వైరస్ తన ప్రభావాన్ని చూపిస్తోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఫలితంగా ప్రజలకు రక్షణ లేకుండా పోతోంది. ప్రజలందరికీ టీకాలు వేయించాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. టీకా విధానంలో వేర్వేరు డోసుల సమర్థత ఇంకా శాస్ర్తీయంగా రుజువు కానందున ప్రస్తుతానిక వ్యాక్సిన్ మిక్సింగ్ అనే ప్రశ్న లేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కొవిషీల్డ్ టీకా ఒక డోసు కాదని రెండు డోసులు తీసుకోవాలని సూచించింది.

ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్ల కొరత లేదని ఆరోగ్య శాఖ తెలిపింది. జులై మధ్య నాటిక లేదా ఆగస్టు నాటికి రోజుకు కోటి మందికి టీకా వేసేందుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 21.6 కోట్ల మంది టీకాలు తీసుకున్నారు. ఇందులో 1.67 కోట్ల మంది ఆరోగ్య కార్యకర్తలు, 2.42 కోట్ల మంది ప్రంట్ లైన్ వర్కర్లు ఉన్నారు. 45 ఏళ్లు పైబడిన వరు 15.48 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. 18-44 ఏళ్ల వారిలో 2.03 కోట్ల మందికి టీకా వేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మే తొలివారంతో పోలిస్తే రోజువాీ కేసులు 69 శాతం తగ్గినట్లు ఆరోగ్య శాఖ వివరించింది. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 6.62 శాతానికి పడిపోయింది. ఏప్రిల్ 1 తర్వాత అది కనిష్టంగా ఉండడం మళ్లీ ఇప్పుడేనని తెలిపింది. దేశంలో క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గాయి. యాక్టివ్ కేసుల్లో రోజుకు 1.3 లక్షల తగ్గుదల కనిపిస్తోంది. గత వారం రజులుగా30 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కేసులు తగ్గుముఖం పట్టాయి.

కొత్త కేసులు కూడా నానాటికీ దిగొస్తున్నాయి. మే 28 నుంచి రోజువారీ కేసులు 2 లక్షలకు దిగువనే ఉంటున్నాయి. మే 7న నమోదైన అత్యధిక రోజువారీ కేసులతో పోలిస్తే ఇప్పుడు దాదాపు 69 శాతం తగ్గాయని ఆరోగ్య శాఖ వివరించింది.344 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువే ఉందని తెలిపింది. రికవరీలు కడా నానాటికి పెరుగుతున్నాయని, ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 92 శాతానికి చేరినట్లు పేర్కొంది