https://oktelugu.com/

‘రాధేశ్యామ్’ మూవీ విడుదలపై కీలక నిర్ణయం

ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ మూవీ విడుదల ప్రతీసారి సందిగ్ధంలో పడిపోతూనే ఉంది. ఇలా విడుదలకు ప్లాన్ చేయడం.. కరోనా విజృంభించి లాక్ డౌన్ తో థియేటర్లు మూతపడడం జరిగిపోతోంది. అందుకే ఈసారి మేకర్స్ విభిన్నమైన ప్లాన్ రూపొందించినట్టు సమాచారం. ఇప్పటికే హిందీలో రూపొందిన సల్మాన్ ఖాన్ మూవీ ‘రాధే’ కూడా ఇక ఆగలేక ఇటు ఓటీటీలో.. అటు థియేటర్లలో ఒకేసారి విడుదల చేసి క్యాష్ చేసుకున్నారు. ఇప్పుడు సేమ్ అదే పద్ధతిని రాధేశ్యామ్ కూడా ఫాలో అవుతున్నట్టుగా […]

Written By:
  • NARESH
  • , Updated On : June 2, 2021 / 10:40 AM IST
    Follow us on

    ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ మూవీ విడుదల ప్రతీసారి సందిగ్ధంలో పడిపోతూనే ఉంది. ఇలా విడుదలకు ప్లాన్ చేయడం.. కరోనా విజృంభించి లాక్ డౌన్ తో థియేటర్లు మూతపడడం జరిగిపోతోంది. అందుకే ఈసారి మేకర్స్ విభిన్నమైన ప్లాన్ రూపొందించినట్టు సమాచారం.

    ఇప్పటికే హిందీలో రూపొందిన సల్మాన్ ఖాన్ మూవీ ‘రాధే’ కూడా ఇక ఆగలేక ఇటు ఓటీటీలో.. అటు థియేటర్లలో ఒకేసారి విడుదల చేసి క్యాష్ చేసుకున్నారు. ఇప్పుడు సేమ్ అదే పద్ధతిని రాధేశ్యామ్ కూడా ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది.

    ఇప్పట్లో కరోనా తగ్గేలా కనిపించడం లేదు. అలాగని కోట్లు పెట్టిన సినిమాను ఆపే పరిస్థితి లేదు. అందుకే ప్రభాస్ హీరోగా నటించిన ఈ ప్యాన్ ఇండియా మూవీని ఒకేసారి అటు ఓటీటీలో.. ఇటు థియేటర్లలో రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట..

    ప్రస్తుతం రాధేశ్యామ్ నిర్మాతలతో జీగ్రూప్ సంస్థ చర్చలు మొదలుపెట్టిందని సమాచారం. ఇదే సంస్థ రాధే సినిమాను రిలీజ్ చేసింది. ఇప్పుడు రాధేశ్యామ్ తో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.

    జూన్ మొత్తం లాక్ డౌన్ తో పోయినా వచ్చే నెలల్లో వ్యాక్సినేషన్ మొదలై తెరుచుకునే అవకాశాలున్నాయి. అందుకే జూలై 30న ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. ఆ టైమ్ కు కరోనా తగ్గినా థియేటర్లు తెరుచుకుంటాయనే నమ్మకం మాత్రం కనిపించడం లేదు. అందుకే మధ్యేమార్గంగా ‘రాధే మోడల్’ ను ఫాలో అవ్వాలని యూవీ క్రియేషన్స్ నిర్మాతలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.