https://oktelugu.com/

BJP: బిజెపికి మూడోసారి అధికారం ఖాయమా? ఆ పార్టీ జ్యోతిష్యం ఎలా ఉందంటే?

బిజెపి ఏర్పాటు నాటి సమయాన్ని బట్టి.. ఆ పార్టీకి సంబంధించిన రాశి, ఇతర గ్రహబలాలు మొదటి నుంచి ఒకింత ఆసక్తికరంగానే ఉన్నాయి. ఈ పార్టీ గెలుపు, ఓటములను తారుమారు చేయగలదు.

Written By: , Updated On : March 12, 2024 / 12:13 PM IST
BJP

BJP

Follow us on

BJP: “300 కు పైచిలుకు స్థానాల్లో విజయం సాధించి.. మూడోసారి అధికారంలోకి వస్తాం. ” ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి మొదలు పెడితే జేపీ నడ్డా వరకు ఇదే విషయాన్ని పదే పదే చెబుతున్నారు. ఇక స్థానికంగా ఉన్న నాయకుల మాటలకైతే ఇక లెక్కేలేదు. నిజంగా బిజెపి 300 కు మించి పార్లమెంటు స్థానాల్లో విజయం సాధిస్తుందా? ఆ పార్టీలో ఆ స్థాయిలో ఆత్మవిశ్వాసానికి కారణం ఏంటి? క్షేత్రస్థాయిలో బిజెపికి అంత సానుకూల పవనాలు ఉన్నాయా? అనే ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఎలాగైనా మాట్లాడుతారు. ఎందుకంటే అలా మాట్లాడకపోతే ప్రజలు తమకు ఓట్లు వేయరని నాయకుల నమ్మకం. ఈసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధిస్తామని చెబుతున్న బిజెపికి సంబంధించిన జాతకాన్ని ఒకసారి పరిశీలిస్తే.. భారతీయ జనతా పార్టీ ఏప్రిల్ 6 1980 ఉదయం 11: 45 నిమిషాలకు ఏర్పాటయింది.

బిజెపి ఏర్పాటు నాటి సమయాన్ని బట్టి.. ఆ పార్టీకి సంబంధించిన రాశి, ఇతర గ్రహబలాలు మొదటి నుంచి ఒకింత ఆసక్తికరంగానే ఉన్నాయి. ఈ పార్టీ గెలుపు, ఓటములను తారుమారు చేయగలదు. ఈసారి ఎన్నికల్లో కూడా బిజెపికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయనే చెబుతున్నారు. బిజెపి జన్మ నక్షత్రం విభాగంలో లగ్నం, వారసుడు ఇద్దరు నాలుగో ఇంట్లో ఉన్నారు. ఇలా ఉంటే అది మతపరమైన వ్యవహారాలకు సూచిక. ప్రస్తుతం బిజెపి మతపరమైన వ్యవహారాలతోనే ప్రయోజనం పొందుతోంది. దీనివల్ల ఒక సెక్షన్ ప్రజల నుంచి దానికి ఆదరణ లభిస్తోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.. అయోధ్య రామ మందిర నిర్మాణం, ద్వారక అభివృద్ధి వంటి అంశాలను ఎన్నికల్లో బిజెపి ఉపయోగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటివల్ల బిజెపి మరోసారి అధికారంలోకి వస్తుందని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తున్నారు.. మరోవైపు ఫిబ్రవరి 16న బీజేపీకి చంద్రుని ప్రధాన కాలంలో బుధుడు ఉపకారిగా ప్రవేశించడంతో గజకేసరి యోగం కలిగింది.

గజకేసరి యోగం వల్ల పార్టీకి విజయం లభిస్తుందని తెలుస్తోంది. దీనివల్ల బిజెపి మరోసారి అధికారాన్ని దక్కించుకునే అవకాశం ఉందని, గెలుపు కోసం అది అనేక రకాల ప్రయత్నాలు చేస్తుందని, ప్రజల్లో విశ్వాసాన్ని చూరగొనే పనులు చేపడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు.

(ఈ కథనాన్ని జ్యోతిష్య శాస్త్ర నిపుణుల అంచనా ప్రకారం రూపొందించాం)