India silent operation in Pakistan: భారత్‌పై ఉగ్రవాద కార్యకలాపాలు జరపాలని పాకిస్తాన్ తరచూ కుట్రలు చేస్తోంది. ఇందుకు జైష్ ఏ మహ్మద్, లష్కర ఎ తోయిబా, హిజుబుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్ర సంస్థలను ప్రోత్సహిస్తోంది. ఇదే సమయంలో భారత్ కూడా పాకిస్తాన్‌లో రహస్య ఆపరేషన్లు నిర్వహిస్తోంది. గుర్తు తెలియని సాయుధుల రూపంలో మనవాళ్లు అక్కడి ముష్కరులను, సైనికాధికారులను లేపేస్తోంది. దీంతో పాక్ షాక్ అయింది. భారత్‌లో ఉగ్ర చర్యల్లో పాలుపంచుకున్న పలువురు తీవ్రవాద నాయకులు ఇటీవల పాకిస్తాన్‌లోనే అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందుతున్నారు. కొన్ని సందర్భాల్లో అనారోగ్యంతో చనిపోయినట్లు చెప్పినా, చాలా సందర్భాల్లో గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో కూలిపోయిన ఘటనలు పెరిగాయి. పంజాబ్, రావల్పిండి, కరాచీ ప్రాంతాల్లో ఇటువంటి సంఘటనలు పెరగడం గమనార్హం. ఈ పరిణామాలు పాకిస్తాన్ శాశ్వత భద్రతా వ్యవస్థలో బీభత్సాన్ని రేపుతున్నాయి.
టార్గెట్ బ్లాక్ టీం..
బ్లాక్ టీం అనేది పాకిస్తాన్ మిలటరీలోని రహస్య విభాగం. అధికారిక గుర్తింపులేని ఈ దళం భారత్‌పై ఉగ్ర మార్గాల్లో కుట్రలు పన్ని, రహస్య సమాచార సేకరణ, సరిహద్దు పైన దాడుల ప్లానింగ్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. కానీ ఇప్పుడు అదే విభాగం అంతర్గతంగా టార్గెట్ అవుతోంది. ముజాహిద్దీన్ సర్వర్స్ అని పిలవబడే బ్లాక్ టీంకు చెందిన ఒక అధికారి ఇ
టీవల గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో మృతి చెందడం పాకిస్తాన్ సైనిక వర్గాలను గందరగోళంలో పడేసింది. పాకిస్తాన్‌లోని ఐఎస్‌ఐ, మిలటరీ, ఉగ్రవాద సంస్థల మధ్య గుప్తవర్గ రాజకీయాలు ఈ హత్యల మధ్య దాగి ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు ఉగ్ర నిధులకు సంబంధించిన వివాదాలు, మరోవైపు అంతర్జాతీయ ఒత్తిడి – ఈ రెండూ కలసి అంతర్గత ఘర్షణలకు దారితీస్తున్నాయి.
భారత భద్రతా సంస్థల వర్గాల అంచనా ప్రకారం, భారత్‌పై ఆపరేషన్లు ప్లాన్ చేసే శత్రువులే ఇప్పుడు అంతర్గత దాడుల లక్ష్యంగా మారుతున్న నేపథ్యం, ఆ దేశ ఉగ్ర వ్యవస్థలో నిర్మాణాత్మక చీలికలను స్పష్టంగా చూపుతోంది. పాకిస్తాన్‌లో జరిగిన తాజా ఘటన భారత్‌పై కుట్రలు పన్నే వర్గాలు ఇప్పుడు తామే పతన మార్గంలో ఉన్నాయన్న బలమైన సంకేతం. ఉగ్ర చర్యల వెనక ఉన్న బ్లాక్ టీం సభ్యుల మరణాలు ఇప్పటివరకు గోప్యంగానే సాగినా, అవి పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలోని అంతర్గత ఉత్పాతాన్ని బయటపెడుతున్నాయి.