First 3D Post Office: దేశంలోనే తొలి 3డి పోస్టాఫీసు బెంగళూరులో ప్రారంభమైంది. రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ దీనిని ప్రారంభించారు. టెక్నాలజీలో ముందున్న బెంగళూరు .. దేశానికి ఎప్పుడూ ఓ కొత్త విషయాన్ని అందిస్తోందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ 3డి టెక్నాలజీతో అల్సూర్ బజార్ పోస్టాఫీస్‌ను ఎల్ అండ్ టీ కంపెనీ నిర్మించింది. రూ.23 లక్షలతో ఈ భవనాన్ని నిర్మించారు. సొంత సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి.. భవిష్యత్ భారతావానికి స్ఫూర్తినిస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
నిర్మాణ వ్యయం తగ్గింపు..
దేశంలో సిమెంట్ మొదలు.. ఐరన్ వరకు అన్నింటి ధరలు పెరిగిపోయాయి. దీంతో నిర్మాణ ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో.. కొత్త కొత్త టెక్నాలజీలను ఉపయోగించి నిర్మాణాలు ప్రారంభిస్తున్నారు. దీంతో ఖర్చు, శ్రమ, సమయం తగ్గుతున్నాయి. కర్ణాటకలోని బెంగళూరులో 3డి ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి పోస్టాఫీసును నిర్మించారు. ఇది దేశంలోపూ మొట్టమొదటిది గమనార్హం.
కేవలం రూ.23 లక్షలతో…
బెంగళూరులో నగరంలో దాదాపు రూ.23 లక్షల వ్యయంతో ఈ 3డి పోస్టాఫీసును నిర్మించారు. సాధారణంగా పోస్టాఫీసు నిర్మాణానికి అయ్యే ఖర్చు కంటే తక్కువ ఖర్చుతో.. 3డి ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి నిర్మించారు. బయోకాన్∙చీఫ్ కిరణ్ మజుందార్ షా దీని గురించి కీలక విషయాలు వెల్లడించారు. ఇది దేశంలోనే మొదటి 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ పోస్టాఫీసు అని వ్యాఖ్యానించారు.
30 నుంచి 40 శాతం ఖర్చు ఆదా..
3డి టెక్నాలజీ వినియోగంతో సాధారణంగా పోస్టాఫీసు నిర్మాణానికి అయ్యే ఖర్చు కంటే.. 30 నుంచి 40 శాతం తక్కువ ఖర్చుతో పోస్టాఫీసును నిర్మించవచ్చని నిపుణులు చెబుతున్నారు. నిర్మాణ సమయం కూడా తక్కువగా పడుతుందని పేర్కొన్నారు. బెంగళూరులో 3డి పోస్టాఫీస్‌ను 1,021 చదరపు అడుగుల విస్తీర్ణంలో కేవలం 45 రోజుల్లోనే నిర్మించినట్లు వెల్లడించారు.
సంప్రదాయ పద్ధతిలో నిర్మిస్తే దాదాపు ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం పడుతుందని తెలిపారు. ఐఐటీ మద్రాస్ సాంకేతిక మార్గదర్శకాలను అందించింది.
ఆటోమేటెడ్ భవనం..
ఈ కొత్త నిర్మాణ సాంకేతికత 3డి కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా నిర్వహించబడింది. ఇది పూర్తిగా ఆటోమేటెడ్ భవన నిర్మాణ సాంకేతికత, దీనిలో రోబోటిక్ ప్రింటర్ కాంక్రీట్ లేయర్–బై–లేయర్‌ను ఆమోదించిన డిజైన్ మరియు స్పెషల్ గ్రేడ్ ప్రకారం డిపాజిట్ చేస్తుంది. నిర్మాణాన్ని ముద్రించడానికి పొరల మధ్య బంధాన్ని నిర్ధారించడానికి త్వరగా గట్టిపడే కాంక్రీటు ఉపయోగించారు.