Chandrayaan 3 : చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా అడుగుపెట్టిన రోవర్ ప్రజ్ఞాన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రజ్ఞాన్‌ను విజయవంతంగా చంద్రుడిపై దింపిన ల్యాండర్ విక్రమ్ భారత కలలను నెరవేర్చింది. సుమారు 40 రోజులపాటు ప్రయాణించి చంద్రుడిపై దిగిన ల్యాండర్ తో అంతరిక్ష చరిత్రలో భారత్ సువర్ణ అధ్యాయాన్ని సృష్టించింది.
ల్యాండర్ విక్రమ్ నుంచి వేరుపడి చంద్రుడిపై అడుగుపెట్టిన రోవర్ ప్రజ్ఞాన్ 14 రోజులపాటు చంద్రుడి ఉపరితలాన్ని పరిశోధించనుంది. 14 రోజుల తర్వాత పరిస్థితి అనుకూలిస్తే మరో 14 రోజులు పనిచేయనున్న ప్రజ్ఞాన్.
చంద్రుడిపై అడుగు పెట్టాలన్న భారత సంకల్పం నెరవేరింది. జూలై 15న ప్రయోగించిన చంద్రాయన్ – 3 దాదాపు 43 రోజుల ప్రయాణం తర్వాత చంద్రమామపై సేఫ్ లాండింగ్ అయ్యింది. దీంతో శాస్త్రవేత్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చిన్నపిల్లల్లా వారంతా కేరింతలు కొట్టారు. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల తర్వాత రోవర్ విక్రమ్ చందమామపై ల్యాండ్ అయ్యేలా ప్రణాళిక సిద్ధం చేశారు. బెంగళూర్‌లోని కంట్రోల్ స్టేషన్ నుంచి విక్రమ్‌ను ఆపరేటింగ్ చేశారు. విక్రమ్ ల్యాండింగ్‌ను దేశమంతా వీక్షించారు. మోడీ సౌతాఫ్రికా నుంచి లైవ్ లో చూస్తూ ఈ సక్సెస్ తర్వాత ఉద్వేగంగా మాట్లాడారు.