IAS and IPS Lovers Marriage : జీవింతంలో ప్రతి ఒక్కరికి పెళ్లి ఓ మధుర జ్ఞాపకం. దీనిని ఎంత వీలయితే అంత ఘనంగా చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. కొందరు కోట్లు ఖర్చు చేస్తారు. మరికొందరు తక్కువ బడ్జెట్ కేటాయిస్తారు. అయితే పెళ్లి అనే ప్రక్రియను ఇప్పటికీ బడాబాబులు కనీసం ఐదు రోజుల పాటు నిర్వహించుకుంటున్నారు. ఎందుకంటే జీవితంలో ప్రధాన శుభకార్యం పెళ్లి గనుక. దీనిని జీవితాంతం గుర్తుండిపోయేలా నిర్వహించుకుంటారు.

అయితే ఇటీవల ఇద్దరు ఐఏఎస్ అధికారులు తమకు పెళ్లి చేసుకోవడానికి అస్సలు సమయం దొరకడం లేదు. ఎప్పుడు పెళ్లి నిశ్చయించుకుంటున్నా.. ఏదో ఒకటి అడ్డం వస్తోంది. దీంతో తాము పనిచేస్తున్న కార్యాలయంలోనే ఉంగరాలు మార్చుకొని పెళ్లి చేసుకున్నారు. తమ పెళ్లి అయిపోయిందని, ఇక తీరిక దొరికిన ఒకరోజు రిసెప్షన్ ఘనంగా నిర్వహించుకుంటామని ఆ జంట తెలుపుతోంది.
పంజాబ్ కు చెందిన తుషార్ సింగ్లా ఐఏఎస్ కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఉలుబేరియాలో ఎస్డీవోగా పనిచేస్తున్నారు. ఇక బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన నవజోత్ సిమి, తుషార్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వివాహాన్ని పెద్దలకు తెలపడంతో అంగీకరించారు. దీంతో వారు 2021లో పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. అయితే ఆ సమయంలో పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. దీంతో తుషార్ కు ఎన్నికల విధులు పడ్డాయి. దీంతో ఆ సమయంలో పెళ్లి చేసుకోవడం కుదరకపోవడంతో వాయిదా వేసుకున్నారు.
ఆ తరువాత కూడా చాలా సార్లు పెళ్లి చేసుకుందామని అనుకున్నా ఏదో ఒక రకంగా అడ్డు తగులుతోంది. దీంతో తమ పెళ్లిని ఇక వాయిదే వేయకూడదని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా పాట్నాలో ఉన్న నవజోత్ సిమి.. కోల్ కతాలోని తుసార్ ఆఫీసుకు వెళ్లారు. అక్కడ రిజిస్ట్రార్ ను పిలిచి సంతకాలు చేశారు. ఇద్దరు పెళ్లి బట్టలు ధరించి కుటుంబ సభ్యులు, బంధువులను పిలిచారు. రిజిస్ట్రర్ ఆఫీసులోనే 10 నిమిషాల్లో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత ఫోటోలకు ఫోజులిచ్చారు. పని ఎక్కువగా ఉండడం వల్లే ఇలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని మీడియాకు తెలిపారు. అయితే ఆ తరువాత గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తామని వివరించారు.
అయితే ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీరు చేసిన పనిని చాలా మంది మెచ్చుకుంటున్నారు. ఇద్దరు అన్యోన్యంగా కలిసుండేందుకు పెళ్లిని ఎక్కడా చేసుకున్న ఒక్కటే అని సెలవిస్తున్నారు. అయితే ఆడంబరాలకు పోకుండా ఇలా సింపుల్ గా పెళ్లి చేసుకొని లక్షల ఖర్చు వృథా చేయకుండా ఇతరులకు ఆదర్శంగా నిలిచారని కొందరు కొనియాడుతున్నారు. మరికొందరు నేటి కాలంలో డబ్బును వృథాగా ఖర్చు చేసేవాళ్లు వీరిని చూసి నేర్చుకోవాలని అంటున్నారు.