Anchor Suma Photos: గలగల మాట్లాడుతూ.. నవ్వులు పూయిస్తూ.. నవ్వుతూ అందరినీ అలరించే యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిన్న వయసు వారి నుంచి పెద్ద వయసు వారి దాకా.. అందరికీ ఆమె సుపరిచితురాలే. బుల్లితెరపై ఓ ప్రవాహంలా ఆమె ప్రయాణం ఇప్పటికీ సాగుతూనే ఉంది. ఇరవై ఏండ్లకు పైగా ఆమె బుల్లితెరపై యాంకర్ గా నెంబర్ వన్ స్థానంలోనే కొనసాగుతోంది. ఇప్పటికీ ఆమెకు పోటేనే లేదంటే ఆమె హార్డ్ వర్క్ అర్థం చేసుకోవచ్చు.

వాస్తవానికి ఆమె తెలిగింటి అమ్మాయి కాదు. మళయాల నటిగా తన సినీ కెరీర్‌ను మొదలు పెట్టింది. కానీ తెలుగులో తడబడకుండా.. తెలుగు వారికంటే కూడా అనర్గళంగా మాట్లాడుతుంది సుమ. ఇండస్ట్రీలో ఏ పెద్ద ఫంక్షన్ అయినా లేదంటే.. స్టార్ హీరోల సినిమాల ఫంక్షన్ అయినా, పెద్ద హీరో ఇంటర్వ్యూ అయినా ఆమె కచ్చితంగా ఉండాల్సిందే. అది ఆమెకు ఉన్న డిమాండ్.

కాగా సుమ కేవలం తెలుగులోనే కాకుండా, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా చక్కగా మాల్లాడుతుంది. కాగా మొదట్లో 1991లో ఆమె మళయాళంలో కొన్ని సినిమాలు చేసినా.. పెద్దగా ప్రయోజనం లేదు. అయితే దాసరి నారాయణ రావు డైరెక్షన్ లో 1996లో కల్యాణ ప్రాప్తిరస్తు మూవీలో నటించి మంచి గుర్తింపు పొందింది. ఇక దీని తర్వాత మలయాళ మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. కానీ ఆమెకు హీరోయిన్ గా పెద్దగా గుర్తింపు రాలేదు. ఇదే క్రమంలో రాజీవ్ కనకాలతో ప్రేమ, పెండ్లి చకచకా జరిగిపోయాయి.

ఇక అప్పటి నుంచి ఆమె తెలుగులో యాంకర్ గా తన కెరీర్‌ను కొనసాగించింది. ఇప్పటికీ తిరుగులేకుండా దూసుకుపోతోంది. కాగా ఇప్పుడు సుమకు సంబంధించిన కొన్ని రేర్ ఫొటోలు నెట్టింట్లో చెక్కర్లు కొడుతున్నాయి. సుమకు సంబంధించిన చిన్నప్పటి ఫొటోలు, పెండ్లి ఫొటోలు చాలా అందంగా ఉన్నాయి. ఇవి ఇప్పుడు బాగా పాపులర్ అయిపోతున్నాయి. మరి లేటెందుకు మీరు కూడా చూసేయండి.









Also Read: ఈవీవీ లైఫ్ లో ఈ బ్లాక్ బస్టర్ మూవీ బడ్జెట్ కేవలం రూ.50 లక్షలు… వచ్చింది 2 కోట్లు.. ఏదో తెలుసా?


Also Read: రాజమౌళి, కీరవాణి పేర్ల ముందు ఎమ్ఎమ్, ఎస్ఎస్ ఉండటానికి కారణం ఇదే..!
TDP Leader Devineni Uma Strong Warning To YCP Minister Kodali Nani
[…] Also Read: యాంకర్ సుమ రేర్ ఫొటోలు మీకోసం.. చిన్న… […]
[…] Also Read: యాంకర్ సుమ రేర్ ఫొటోలు మీకోసం.. చిన్న… […]