వరల్డ్ కప్ లకు కెప్టెన్లను మార్చడం అంత మంచిది కాదు. అలా మారుస్తు ఉంటే జట్టు పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో దీనిపై సునిల్ గావస్కర్ స్పందించాడు. వచ్చే రెండు వరల్డ్ కప్ లకు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉంటే మచిదని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మకు మంచి రికార్డు ఉన్న సంగతి తెలిసిందే. అతడి సారథ్యంలో ముంబై ఇప్పటి వరకు ఐదు టైటిళ్లు గెలిచింది.

మరో వైపు కోహ్లీ కెప్టెన్ గా ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇంతవరకు ఒక్కసారి కూడా కప్ గెలవలేదు. ఈ క్రమంలో తదుపరి కెప్టెగా రోహిత్ శర్మ పేరు వినిపిస్తోంది. అయితే, కొందమంది దిగ్గజాలు మాత్రం వయసు రీత్యా రోహిత్ ను పక్కన పెట్టి కేఎల్ రాహుల్ లేదంటే రిషబ్ పంత్ కు అవకాశమిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.
సునిల్ గావస్కర్ సైతం తొలుత తన ఓటు కేఎల్ రాహుల్ కే అన్నాడు. కానీ తాజాగా ఓ షోలో మాట్లాడుతూ రోహిత్ రెండు మెగా ఈవెంట్లకు కెప్టెన్ గా ఉండాలంటూ మాట మార్చాడు. వచ్చే రెండు వరల్డ్ కప్ లకు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉంటే మంచిది. ఒకటి వచ్చే నెలలో ఆరంభం కానుంది. మరోకటి వచ్చే ఏడాది. కాబట్టి.. కెప్టెన్లను మారుస్తూ ఉంటే ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. రెండు ప్రపంచకప్ లకు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉండాలన్నదే నా నిశ్చిత అభిప్రాయం అని గావస్కర్ చెప్పుకొచ్చాడు.