Gyanvapi: వారణాసి కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో గురువారం నుంచి జ్ఞానవాపీ మసీదులో శివుడికి పూజలు మొదలయ్యాయి. హిందూ సంఘాలు కోర్టులో కేసు వేయడం.. జాతీయ పురావస్తు శాఖ ఆధ్వర్యంలో తవ్వకాలు జరగడం.. అందులో పలు కీలక ఆధారాలు లభించడంతో వారణాసి కోర్టు హిందూ సంఘాల తరఫు న్యాయవాది తో ఏకీభవించింది. బుధవారం జరిగిన కేసు విచారణలో కీలకతీర్పు వెలువరించింది. జ్ఞానవాపి మసీదులో హిందువులు పూజలు చేసుకోవచ్చని, అక్కడ శివుడికి అభిషేకాలు జరుపుకోవచ్చని సూచించింది. హిందువులు పూజలు జరిపేందుకు గురువారం నుంచి ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించింది. కోర్టు తీర్పు విలువరించిన నేపథ్యంలో గురువారం జ్ఞానవాపీ మసీదులో ఉదయం పూజలు ప్రారంభమయ్యాయి.. సెల్లార్లో శివుడికి ఓ అర్చకుడు పూజలు జరుపుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
జ్ఞానవాపి మసీదులోని బేస్ మెంట్ వ్యాస్ టిఖానా వద్ద ఉన్న హిందూ దేవతల విగ్రహాలకు గురువారం పూజలు. మసీదులో పూజలు చేసుకోవచ్చని వారణాసి కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో గురువారం హిందూ దేవతల ప్రతిమలకు కూడా అర్చకులు పూజలు నిర్వహించారు. వారంలోగా పూజలు చేసుకునేందుకు ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని వారణాసి కోర్టు న్యాయమూర్తి ఏకే విశ్వాస్ బుధవారం ఆదేశించిన విషయం తెలిసిందే. ఆయన ఆదేశాల ప్రకారం గురువారం నుంచి అక్కడ పూజలు ప్రారంభమయ్యాయి. శివుడికి, ఇతర హిందూ దేవుళ్ళ ప్రతిమలకు ఒక పూజారి హారతి ఇస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఆ దృశ్యాలు వాస్తవమని హిందూ సంఘాల తరఫున జ్ఞానవాపీ కేసు కోర్టులో వాదిస్తున్న న్యాయవాది విష్ణు శంకర్ జైన్ ప్రకటించారు.
వారణాసి కోర్టు తీర్పు నేపథ్యంలో హిందూ దేవతల ప్రతిమలకు పూజలను అడ్డుకోవాలని ముస్లింలు ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జాతీయ పురావస్తు శాఖ కీలక ఆధారాలు సమర్పించిన నేపథ్యంలో ఈ కేసును అలహాబాద్ కోర్టులో తెలుసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. అయితే ఈ వివాదంపై ముస్లిం సంఘాల నాయకులు అలహాబాద్ పోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ జ్ఞానవాపీ కేసులో మరింత అనుకూలంగా తీర్పు వస్తే అక్కడ కాశీ విశ్వనాథుడికి మరింత విశాలమైన ఆలయాన్ని కట్టించాలని హిందూ సంఘాల నాయకులు భావిస్తున్నారు. అయోధ్య రామ మందిరం ట్రస్టు లాగానే ఒకటి ఏర్పాటు చేసి.. దేశవ్యాప్తంగా విరాళాలు సేకరించి.. ఆలయాన్ని నిర్మిస్తామని పేర్కొంటున్నారు. గురువారం పూజలు నిర్వహించిన నేపథ్యంలో శివుడి కోసం నంది ఆతృతగా ఎదురుచూస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, జ్ఞానవాపీ మసీదులో శివుడికి అర్చకుడు పూజలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
#WATCH | A priest offers prayers at ‘Vyas Ji ka Tehkhana’ inside Gyanvapi mosque in Varanasi, after District court order.
Visuals confirmed by Vishnu Shankar Jain, the lawyer for the Hindu side in the Gyanvapi case pic.twitter.com/mUB6TMGpET
— ANI (@ANI) February 1, 2024