Groom died: ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు అన్నారో సినీకవి. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. అదే విధి అంటే. విధికి తలవంని వారుండరు. దానికి బాధ్యులు కాని వారు లేరంటే అతిశయోక్తి కాదు. విధి తలుచుకుంటే పచ్చని సంసారంలో నిప్పులు పోయొచ్చు. చల్లని కాపురంలో వేడి రగించొచ్చు. అంతా హాయిగా ఉన్న కుటుంబంలో కలతలు సృష్టించొచ్చు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఆ కుటుంబం అంతా పెళ్లి వేడుకల్లో సంబరంగా ఉన్నారు. పెళ్లికొడుకు, పెళ్లికూతురు స్టేజీ మీద ఉండి అతిథులతో ఫొటోలు దిగుతున్నారు.
ఇంతలోనే పెళ్లి కొడుకు చాతిలో ఏదో నొప్పి వస్తుందని చెప్పడంతో అతడిని ఇంట్లోకి తీసుకెళ్లి కుర్చీపై కూర్చోబెట్టారు. కొద్దిసేపు ఉన్నా నొప్పి తగ్గలేదు. దీంతో అంబులెన్స్ కు ఫోన్ చేశారు. దీంతో అంబులెన్స్ రావడంతో అతడిని అందులో వేసుకుని ఆస్పత్రికి వెళ్లారు. కానీ అక్కడకు చేరుకునే లోపు వరుడు మృతి చెందడం విషాదం నింపింది. పచ్చని పందిట్లో చావు బాజా మోగడం నిజంగా దురదృష్టమే. పెళ్లి కొడుకు హఠాన్మరణం అందరిలో కలతలు పెంచింది. విధి ఆడిన వింత నాటకంలో పెళ్లి కూతురు సమిధగా మిగిలిపోతోంది.
మనిషి జీవితానికి గ్యారంటీ లేదు. కానీ ఇలా పెళ్లి పందిట్లో విషాదం జరగడం నిజంగా దారుణమే. అంతా బాగుందని అనుకునే లోపే అతడి ఆయువు అనంతవాయువుల్లో కలిసి పోవడం విచారకరం. భవిష్యత్ పై ఎన్నో కలలు కన్న ఆ జంట కన్నీటి పర్యంతమైంది. వధువు బోరున విలపించింది. కట్టుకున్న వాడి సంబరం ఎంతో కాలం నిలవలేదు. కనీసం వారి ఊసులు పంచుకోలేదు. ఆశలు తీరలేదు. ఇంతలోనే ప్రాణాలు కోల్పోవడం విషాదమే. ఇది కర్ణాటక రాష్ర్టంలో చోటుచేసుకుంది. హోయారు స్వామి అనే యువకుడి పెళ్లి విందు కార్యక్రమంలో హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలోనే చనిపోవడం జరిగింది.
దీంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంతో వేడుకతో నిర్వహించుకున్న విందులో పెళ్లికొడుకు చనిపోవడం అందరిని బాధించింది. జీవితంపై ఎన్నో ఆశలతో వివాహం చేసుకున్న వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు. పెళ్లికొడుకు మరణం జీర్ణించుకోలేకపోతున్నారు. తమకు ఎందుకిలా జరిగిందని రోదిస్తున్నారు. వినోద కార్యక్రమం కాస్త విషాదంగా మారడం విడ్డూరమే. కానీ విధికి ఎవరైనా బలికాక తప్పదు. కొత్త జంటైనా సరే దాని ముందు ఓటమి అంగీకరించాల్సిందే.