IT Jobs India: కరోనా కల్లోలం తర్వాత ఐటీ రంగానికి కొత్త ఊపు వచ్చింది. వచ్చే ఏడాది కొత్త కొలువుల జాతర రానుంది. ఈ మేరకు జోరుగా నియామకాలు చేపట్టేందుకు ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు, భారతీయ ఐటీ దిగ్గజాలు రెడీ అవుతున్నాయి. కరోనా ఆంక్షలు ముగియడంతో అన్ని రంగాల కార్యకలాపాలు పున: ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఐటీ ఇండస్ట్రీ భారీ ఎత్తున నియామకాలు చేపట్టడానికి సన్నద్ధమవుతోంది.

టాప్ 4 ఐటీ దిగ్గజ సంస్థలు 2023 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 1.4 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకున్నాయి. ఫ్రెషర్స్ ను భారీగా తీసుకోనుంది. ఇందులో ప్రముఖ ఐటీ కంపెనీలైన కాగ్నిజెంట్, హెచ్.సీఎల్, విప్రో, టెక్ మహీంద్ర కంపెనీలు కలిసి 1,40,000 ఫ్రెషర్స్ కు కొత్త ఐటీ ఉద్యోగాలు ఇవ్వాలని సంకల్పించాయి.
Also Read: Uttar Pradesh: విమానంలో సీఎంకు గాయాలు.. అనుమానాస్పదంపై కేంద్రం దర్యాప్తు?
ప్రస్తుతం ఐటీ రంగానికి ఊపు వచ్చిందని.. డిమాండ్ దృష్ట్యా ప్రముఖ ఐటీ శిక్షణ సంస్థ ఎన్ఐఐటీ ఈ మేరకు గ్రాడ్యూయేట్స్ కు శిక్షణ అందిస్తోంది. ఆన్ లైన్ కోర్సులను ప్రవేశపెట్టింది.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో మెరుగైన శిక్షణ తీసుకోకుంటే ఉద్యోగులు వెనుకబడి పోవడం ఖాయం. కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి సైతం టెక్నికల్ స్కిల్స్ తోపాటు సాఫ్ట్ స్కిల్స్ ను నిట్ సంస్థ నేర్పిస్తోంది. నిట్ లో శిక్షణ పొందిన వారు సంవత్సరానికి రూ.10లక్షల వేతన ప్యాకేజీ కూడా లభిస్తోంది.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎన్నో ఐటీ సంస్థలు నియామకాలకు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు ఫ్రెషర్స్ ఈ అవకాశాలను అందిపుచ్చుకుంటే మెరుగైన ఉద్యోగాలు పొందే అవకాశాలున్నాయి.
Also Read: Surekha Vani: ‘సురేఖావాణి’ని వాడుకుని మోసం.. అలెర్ట్ అయిన సురేఖావాణి !