https://oktelugu.com/

రైలు ప్రయాణికులకు శుభవార్త.. పూర్తిస్థాయి సర్వీసులు ఎప్పటినుంచంటే..?

గతంలో ఏ వైరస్ విజృంభించినా ఆ వైరస్ మనుషుల ఆరోగ్యంపై మాత్రమే ప్రభావం చూపేది. అయితే కరోనా వైరస్ మాత్రం మనుషులతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. కరోనా వైరస్ విజృంభణ కేంద్రం లాక్ డౌన్ అమలైన రోజు నుంచి రైలు ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. కరోనా వైరస్ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపినా కేంద్రం పరిమిత రైళ్లకు మాత్రమే అనుమతులు ఇచ్చింది. ఇండియన్ రైల్వేస్ ప్రస్తుతం ప్రత్యేక రైళ్లను […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 16, 2020 / 09:38 AM IST
    Follow us on

    గతంలో ఏ వైరస్ విజృంభించినా ఆ వైరస్ మనుషుల ఆరోగ్యంపై మాత్రమే ప్రభావం చూపేది. అయితే కరోనా వైరస్ మాత్రం మనుషులతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. కరోనా వైరస్ విజృంభణ కేంద్రం లాక్ డౌన్ అమలైన రోజు నుంచి రైలు ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. కరోనా వైరస్ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపినా కేంద్రం పరిమిత రైళ్లకు మాత్రమే అనుమతులు ఇచ్చింది.

    ఇండియన్ రైల్వేస్ ప్రస్తుతం ప్రత్యేక రైళ్లను మాత్రమే నడుపుతోంది. అయితే మళ్లీ రైలు ప్రయాణికులకు పూర్తిస్థాయిలో రైలు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. గతంలో మాదిరిగా పూర్తిస్థాయిలో రైలు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం, రైల్వేశాఖ యోచిస్తున్నాయి. నవంబర్ నుంచి అన్ని రైళ్లను పట్టాలెక్కించే దిశగా అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది.

    ఇండియన్ రైల్వేస్ తొలుత ఎక్స్ ‌ప్రెస్ ట్రైన్స్ అన్నింటినీ నడిపేందుకు సిద్ధమవుతోంది. అయితే ఎక్స్ ప్రెస్ రైళ్లు అన్నీ ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చినా వీటిని స్పెషల్ ట్రైన్స్ పేరుతోనే నడపబోతుందని సమాచారం. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం నిరంతరం రైలు ప్రయాణాలు చేసే వాళ్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రస్తుతం రైల్వే శాఖ 682 స్పెషల్ ట్రైన్స్ ను నడుపుతోంది.

    దసరా, దీపావళి పండుగల సందర్భంగా 416 ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్స్ అందుబాటులోకి రానున్నాయి. వచ్చే నెలలో పరిస్థితులను సమీక్షించి కేంద్రం, రైల్వే శాఖ మెయిల్, ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్ విషయంలో నిర్ణయం తీసుకోనుంది. 2021 జనవరి నాటికి ప్యాసింజర్ రైళ్లను అందుబాటులోకి తీసుకొని రావాలని కేంద్రం భావిస్తోంది. కరోనా, లాక్ డౌన్ వల్ల నష్టాలు వస్తున్న నేపథ్యంలో రైల్వేశాఖ రైళ్ల సర్వీసులను పునరుద్ధరించే దిశగా అడుగులు వేస్తోంది.