Toll Charges: టోల్ ప్లాజా.. అన్ని జాతీయ, రాష్ట్రీయ రహదారులపై ఇవి మనకు కనిపిస్తాయి. పీపీపీ పద్ధతిలో రోడ్ల విస్తరణ చేపడుతున్న ప్రభుత్వాలు.. దానికి అయిన మొత్తాన్ని వాహనదారుల నుంచే వసూలు చేస్తున్నాయి. ఈమేరకు కాంట్రాక్టు సంస్థలు ఆయా రోడ్లపై టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తోంది. కనీసం పదేళ్లు… ఇలా టోల్ వసూలు చేస్తూ.. రోడ్డును మెయింటేన్ చేస్తున్నాయి. నిర్మాణ సంస్థలు. గతంలో టోల్ ప్లాజాల వద్ద మాన్యువల్‌గా డబ్బులు వసూలు చేసేవారు. తర్వాత ఆటోమేటిక్ టోల్ వసూలు చేసే ఫాస్టాగ్‌ను కేంద్రం ప్రవేశపెట్టింది. తాజాగా దీని స్థానంలో కొత్తగా జీవీఎస్ ఆధారిట టోల్ కలెక్షన్ సిస్టమ్‌ను కేంద్రం తీసుకురాబోతోంది.
ట్రాఫిక్ తిప్పలు తప్పేలా..
మాన్యువల్‌గా చేసే వసూలుతో రద్దీ రోజుల్లో టోల్ ప్లాజాల వద్ద ఎక్కువసేపు వేచి ఉండాల్సి వచ్చేంది. దీంతో ఆటోమేటిక్ చార్జి వసూలు కోసం ఫాస్టాగ్ సిస్టమ్‌ను కేంద్రం తీసుకువచ్చింది. అయితే ఈ పద్ధతి కూడా ట్రాఫిక్ సమస్యకు పూర్తిగా పరిష్కరం చూపలేదు. ఈ నేపథ్యంలో జీపీఎస్ ఆధారిత టోల్ సిస్టమ్ అందుబాటులోకి తేవాలని కేంద్రం యోచిస్తోంది. దీంతో హైవేపై ప్రయాణం మరింత వేగంగా, సాఫీగా సాగుతుందని భావిస్తోంది.
2016లో ఫాస్టార్..
2016 ముందు వరకు టోల్ ప్లాజాల్లో మాన్యువల్‌గా టోల్ వసూలు చేసేవారు. తర్వాత కేంద్రం 2016లో ఫాస్టాగ్ విధానం అమలు చేసింది. దీంతో టోల్ ప్లాజాల వద్ద ఆగకుండానే టోల్ వసూలు చేయడం ప్రారంభించింది. అయితే ఇప్పటికీ కొన్ని సమస్యలు తెలెత్తుతున్నాయి. లో బ్యాలెన్స్, సాంకేతిక సమస్యలతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. వీటికి పరిష్కారంగా కేంద్రం జీపీఎస్ ఆధారిత టోల్ సిస్టమ్ తీసుకురావాలని భావిస్తోంది.
జీపీఎస్ టోల్‌లో ఎన్నో ప్రత్యేకతలు
జీపీఎస్ ఆధారిత టోల్ సిస్టమ్ ఒక కొత్త టెక్నాలజీ. ప్రస్తుతం దీనిని ముంబైలోని అటల్ సేతు వంటి కొన్ని రహదారులపై ట్రయల్‌రన్ చేస్తున్నారు. దీనికోసం టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. కదిలే వాహనాల నంబర్ ప్లేట్లను స్కాన్ చేయడం ద్వారా ఇది పనిచేస్తుంది. కెమరాలు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ టెక్నాలజీతో వర్క్ అవుతాయి. ఈ సిస్టమ్‌లో వెహికిల్ రిజిస్ట్రేషన్‌కు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నుంచి టోల్ అమౌంట్ డెబిట్ అవుతుంది. జీపీఎస్ ఆధారిత టోల్ సిస్టమ్ ఫాస్టాగ్ కన్నా అనేక ప్రయోజనాలు ఆఫర్ చేస్తుంది అవేంటో తెలుసుకుందాం.
బెనిఫిట్స్ ఇవే..
జీపీఎస్ టోల్ కలెక్షన్ సిస్టం అందుబాటులోకి వస్తే టోల్ ప్లాజాల వద్ద వాహనాల వేగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉండదు. దీంతో ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ఇక ఫాస్టాగ్స్‌ను రీఛార్జ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. దీంతో యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగవుతుంది. ఎలాంటి అంతరాయం లేకుండా వాహనాలు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోవచ్చు. ట్రాఫిక్ సమస్యలు కూడా ఎదురుకావు.
ఫాస్టాగ్స్ ఉంటాయా?
జీపీఎస్ ఆధారిత టోల్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చాక ఫాస్టాగ్స్ ఉంటావా ఉండవా అనే సందేహాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం జీపీఎస్ సిస్టమ్ పరీక్ష దశలోనే ఉంది. క్రమంగా అన్ని రహదారులకు విస్తరించే అవకాశం ఉంటుంది. అయితే ఒకేసారి ఫాస్టాగ్స్ ఎత్తివేయకపోవచ్చు. ముందుగా రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన రహదారుల్లో దీనిని అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. అయితే ఇది వచ్చినా ఫాస్టాగ్‌లు నిరుపయోగంగా మారవు. వీటిని చిన్న రహదారులపై లేదా బ్యాకప్ ఆప్షన్‌గా కొనసాగించే అవకాశం ఉంటుంది.
నంబర్ ప్లేట్ మార్చాల్సిందే..
ఇక జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ కోసం వాహనదారుల తమ వాహనాల నంబర్ ప్లేట్ మార్చుకోవాలి. కేంద్రం సూచించిన మేరకు నంబర్ ప్లేట్స్ బిగించుకోవాలి. అలా అయితేనే టోల్ ప్లాజాల వద్ద ఏర్పాటు చేసే కెమెరాలు నంబర్‌ను గుర్తిస్తాయి. ఇతర నంబర్ ప్లేట్లు వాడితే దానిని గుర్తించడం కష్టం అవుతుంది.
త్వరలోనే అందుబాటులోకి..
2024 ఏప్రిల్ నుంచి జీపీఎస్ ఆధారిత టోల్ సిస్టమ్ అందుబాటులోకి తేవడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. పైలట్ ప్రాజెక్ట్‌ల విజయం, డేటా ప్రైవసీ వంటి సమస్యలు పరిష్కరించాక ఈ సిస్టమ్ అందుబాటులోకి తీసుకురానుంది. మొత్తంగా జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్ హైవే ప్రయాణ అనుభవాన్ని పూర్తిగా మారుస్తుందని కేంద్రం భావిస్తోంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Good news for motorists no more fastags centers key decision
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com