Modi Putin Friendship: రష్యా అధ్యక్షుడు పుతిన్… డిసెంబర్ 4న భారత్‌కు వచ్చారు. 48 గంటల పర్యటనకు నాలుగేళ్ల తర్వాత భారత గడ్డపై అడుగు పెట్టారు. రష్యా–భారత్ అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి, కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి భారత్‌కు వచ్చారు. ఇప్పటికే ప్రపంచంలో భారత్‌కు అత్యంత మిత్ర దేశం రష్యా.. ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని నరేంద్రమోదీ స్నేహ బంధం కూడా పాతికేళ్లది. ప్రధాని కాకుముందే మోదీ రష్యాలో పర్యటించారు. 2001లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయితో కలిసి గురజాత్ ముఖ్యమంత్రి హోదాలో మోదీ రష్యా వెళ్లారు.
పాతికేళ్ల ఫొటోలు వైరల్…
రష్యా అధినేత పుతిన్ భారత పర్యటన వేళ.. పుతిన్ మోదీ పాతికేళ్ల క్రితం కలిసిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రం రెండు నాయకుల మధ్య దీర్ఘకాలిక సంబంధాన్ని గుర్తు చేస్తోంది. ఇక భారత్‌లో అడుగు పెట్టిన పుతిన్‌కు మోదీ స్వయంగా స్వాగతం పలికారు. ఆత్మీయంగా ఇద్దరు నేతలు ఆలింగనం చేసుకున్నారు. సాధారణంగా రెండు దేశాల అధినేతలు ఆలింగనం చేసుకోవడం అరుదు. ఎంతో సాన్నిహిత్యం ఉంటేగాని ఇలా చేసుకోరు. ఇది కూడా మోదీ–పుతిన్ స్నేహబంధాన్ని సూచిస్తుంది. ఇక ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి మోదీ అధికారిక భవనం వరకు ఇద్దరు నేతలు పుతిన్ కారులోనే వెళ్లారు.
దౌత్య సంబంధాల ప్రారంభం
2001లో మోదీ గుజరాత్ సీఎంగా పుతిన్‌తో మొదటి సమావేశం జరిగింది, ఇది భారత–రష్యా వాణిజ్య, రక్షణ ఒప్పందాలకు బీజం వేసింది. ప్రధానిగా మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత 20కిపైగా భేటీలు జరిగి, ఎస్–400 డీల్, బ్రహ్మోస్ విస్తరణ వంటి చర్చలు జరిగాయి.
నెటిజన్ల ప్రతిస్పందనలు
పాతికేళ్ల ఫొటోపై నెటిజన్లు మోదీ–పుతిన్ బంధాన్ని 25 సంవత్సరాల స్నేహంగా కొనియాడుతున్నారు. రెండు దేశాల మధ్య స్థిరత్వం కొనసాగాలని కోరుకుంటున్నారు, ఇది భారత దౌత్య విధానానికి బలమైన ఉదాహరణగా నిలుస్తోంది. ఈ దీర్ఘకాలిక సంబంధం భారత్‌కు రక్షణ, ఎనర్జీ రంగాల్లో ప్రయోజనం చేకూర్చుతోంది. పుతిన్ పర్యటన ఈ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.