కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ దేశీయ కార్డ్ అయిన రూపే కార్డును ప్రమోట్ చేస్తోంది. రూపే కార్డు ద్వారా కొత్త ఆఫర్లను అందుబాటులోకి తెస్తోంది. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులకు రూపే కార్డులను ఖాతాదారులకు ఎక్కువగా మంజూరు చేయాలని సూచనలు చేసిన సంగతి తెలిసిందే. రూపే కార్డులను ప్రమోట్ చేయాలని మంత్రి బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశారు.
భారతదేశానికి ఎన్‌పీసీఐని బ్రాండ్ గా తీర్చిదిద్దాలని ఖాతాదారులకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులను జారీ చేయాల్సి వస్తే రూపే కార్డులను జారీ చేయాలని నిర్మలా సీతారామన్ కోరారు. భారత్ లోని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూపే కార్డ్ యొక్క నెట్వర్క్ బాధ్యతలను చూసుకుంటోంది. రూపే కార్డ్ మన దేశం యొక్క సొంత కార్డ్ పేమెంట్ నెట్వర్క్ కావడంతో ఈ కార్డులను ప్రమోట్ చేస్తోంది.
ఇప్పటికే రూపే కార్డును వాడుతున్న కస్టమర్లు రూపే వెబ్ సైట్ కు వెళ్లి అందుబాటులో ఉన్న ఆఫర్లకు సంబంధించిన వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఎన్‌పీసీఐ ప్రస్తుతం రూపే ఫెస్టివల్ కార్నివాల్ పేరుతో రూపే కార్డ్ యూజర్లకు భారీగా ఆఫర్లను ప్రకటించింది. రూపే కార్డ్ ఉన్న ఖాతాదారులు అమెజాన్ పే, స్విగ్గీ, హెరిటేజ్ ఫ్రెష్ లలో కొనుగోళ్లు చేసి 10 నుంచి 50 శాతం డిస్కౌంట్ ను పొందవచ్చు.
మింత్రా, టాటా క్లిక్, జోయలుక్కాస్, బాటా, బిగ్ బజార్, బ్రాండ్ ఫ్యాక్టరీ, జీ5 సబ్ స్క్రిప్షన్ పై కూడా రూపే కార్డ్ ఉన్నవాళ్లు తగ్గింపు ఆఫర్లను పొందే అవకాశం ఉంది. రూపే కార్డ్ తో శాంసంగ్ ఉత్పత్తులపై కూడా డిస్కౌంట్ లభిస్తుంది. కేంద్రం రూపే కార్డ్ యూజర్ల సంఖ్య పెంచడం కోసం రూపే కార్డు కొనుగోళ్లపై భారీగా ప్రయోజనాలను అందిస్తోంది.