Father – Daughter: కనిపించే దైవం అమ్మ.. నడిపించే దేవుడు నాన్న.. భారత సమాజాంతో తల్లిదండ్రులను దైవంతో సమానంగా కొలుస్తారు. అయితే ఆధునిక సమాజంలో తల్లిదండ్రుల విలువలు పడిపోతున్నాయి. కొంతమంది తమకు తాము దిగజార్చుకుంటుండగా, మరికొందరిని పిల్లలే చిన్నచూపు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఓ తండ్రి తన కూతురును 36 ఏళ్లుగా గదిలో గొలుసులతో బంధించిన సంఘటన తాజా వెలుగు చూసింది. మానవ జాతి తలదించుకునే ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.
మతిస్థిమితం లేదని…
ఉత్తర్‌ప్రదేశ్‌లో రాష్ట్రంలోని ఫిరోజాబాద్ జిల్లా తుండ్లా ప్రాంతంలోని మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన సప్నా జైన్(53)కు మానసికస్థితి సరిగ్గా ఉండేది కాదు. ఆ కారణంతో ఆమెను 17 ఏళ్ల వయసులో ఆమె తండ్రి గిరీష్‌చంద్ గదిలోకి తీసుకెళ్లి.. గొలుసుతో బంధించాడు. అప్పటి నుంచి గదిలో ఉన్న సప్నాకు ఆమె కుటుంబ సభ్యులు తలుపు కింద నుంచి భోజనం పంపించేవారు. ఆ గదిలోనే సప్నా.. మల మూత్ర విసర్జన చేసేది. కిటికీలో నుంచి నీళ్లు పోస్తూ ఆమెకు స్నానం చేయించేవారు. ఇలా 36 ఏళ్లు గడిచింది.
తండ్రి మరణంతో..
సప్నా జైన్ తండ్రి గిరీష్‌చంద్ ఇటీవల అనారోగ్యం, వయోభారంతో మృతిచెందాడు. 36 ఏళ్లుగా గదిదాఇ బయటకురాని సప్నాజైన్ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈవిషయం తెలుసుకున్న స్థానికులు స్వచ్ఛంద సంస్థకు సమాచారం అందించారు. వారు సప్నాజైన్ ఇంటికి వచ్చిన సేవాభారతి సభ్యులు ఆమె గురించి తెలుసుకున్నారు. చీకటి గది నుంచి ఆమెను బయటకు తీసుకువచ్చారు.
అన్నీ మర్చిపోయిన సప్నాజైన్..
36 ఏళ్లుగా ఒకే గదికి పరిమితమైన సప్నా జైన్ బయటి ప్రపంచం గురించి పూర్తిగా మర్చిపోయింది. మతిస్థిమితం లేని ఆమె మరింత బుద్ధిమాంద్యంతో ఇబ్బంది పడుతోంది. సేవా భారతి సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షలు చేసిన వైద్యులు ఆమె పరిస్థితిని తెలియజేశారు. కనీస పనులను కూడా సప్నాజైన్ మర్చిపోయిందని తెలిపారు. పచ్చిగా చెప్పాలంటే జైన్ మనిషి అన్న విషయాన్ని కూడా మర్చిపోయిందని పేర్కొన్నారు. ఆమెను మామూలు స్థితిలోకి తీసుకురావాలంలే.. ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని.. నిదానంగా మామూలు స్థితికి తీసకువచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. మరోవైపు ఆమో వయసు రిత్యా.. మామూలు స్థితికి వచ్చే అవకాశాలు చాలా తక్కువని పేర్కొంటున్నారు.
మతిస్థిమితం సరిగా లేదన్న ఒకే ఒక్క కారణంలో.. కూతురును 36 ఏళ్లు గదిలో బందించిన తండ్రి తన కూతురుని మరింత పిచ్చిదాన్ని చేశారన్న విమర్శలు వస్తున్నాయి. వైద్యులకు చూపించినా.. మెంటల్లీ రిటార్టెడ్ కేంద్రాలకు తీసుకెళ్లినా పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదని అభిప్రాయపడుతన్నారు.