Anchor Anasuya: రంగమ్మత్త.. రంగస్థలం సినిమా విడుదలయ్యే వరకూ ఈ పేరుకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఆ సినిమాలో యాంకర్, నటి అనసూయ చేసిన పాత్రతో రంగమ్మత్త పేరు మామూలు క్రేజ్ రాలేదు. పెళ్లి తర్వాత బుల్లితెరలోకి ఎంట్రీ ఇచ్చిన అనసూయ.. తర్వాత వెండితెరపై వెలిగిపోతోంది. వయసు పెరుగుతున్నా.. తనలో అందం ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకుంటోంది. ఒకవైపు ఆఫర్లు కొట్టేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియానూ షేక్ చేస్తోంది రంగమ్మత్త. తాజాగా ఆమె హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. అభిమానుల మతి పోగుడుతున్నాయి.

ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..
అనసూయ తాజా ఫొటోలు చూస్తే.. వావ్ ..ఎవరైనా సరే ఇలాంటి అందాన్ని చూశాక ఫిదా అవ్వాల్సిందే. ఆఫ్ కోర్స్ ఆడపిల్లకి అసలైన అందం తీసుకొచ్చేది పట్టు పరికిని. మరి అలాంటి దుస్తుల్లో హాట్ యాంకర్ మెరిసిపోతే ఎవరైనా చూడాలని. ఎవరికైనా చూడాలని అనిపిస్తుంది . ప్రజెంట్ ఇప్పుడు పట్టు లంగా వోణీలో ట్రెడిషనల్‌గా రెడీ అయిన స్టార్ యాంకర్ అనసూయ ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి . బ్లూ కలర్ లంగావోణీలో .. నెక్లెస్ పెట్టుకుని.. కొప్పు చుట్టుకుని.. వయ్యారంగా డ్యాన్స్ చేస్తున్న అనసూయ ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. చిట్టి పొట్టి బట్టల్లో తన అందాలను చూపించే అనసూయ ఈసారి మాత్రం ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ లంగా వోణీలో తనలోని ట్రెడిషనల్ బ్యూటీని చూపించింది .
అభిమానుల్లో సెగలు..

లంగావోణిలో అనసూయ అందాలు చూసిన ఫ్యాన్స్ పూనకాలు వచ్చినట్లు ఊగిపోతున్నారు. మరి కొంతమంది అయితే ‘నీ అసలైన అందం ఇదే అనసూయ.. ఇలాగే ట్రెడిషనల్ గా రెడీ అవ్వు ..యు ఆర్ లూకింగ్ సో గుడ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఎక్కడ పాజిటివిటీ ఉంటుందో అక్కడ నెగెటివిటీ కూడా ఉంటుంది. ఎక్కడ అనసూయని పొగిడే జనాలు ఉంటారో.. అక్కడ తిట్టే జనాలు కూడా ఉంటారు. పట్టు పరికిణిలో అనసూయ కనిపించినా కానీ కొందరు జనాలు ఆమె ఫొటోలను ట్రోల్ చేస్తున్నారు . దానికి మెయిన్ రీజన్ రీసెంట్‌గా జరిగిన ‘ఆంటీ’ ఇష్యూ కారణం.
‘ఆంటీ’ ట్రోల్‌లో చిర్రెత్తుకొచ్చి..
ఇటీవల అనసూయ ఆంటీ అంటూ ట్రోల్ చేశారు. అనసూయ కూడా వాళ్లపై పోలీస్ కేసు పెట్టి నానా రచ్చ చేసింది. అయితే ఇప్పటికి అనసూయ ఆంటీ అంటూ అరకొరా మంది ఆమెను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్‌గా అనసూయ అమెరికాలో తానా సమక్షంలో బతుకమ్మ సెలబ్రేషన్స్‌లో పాల్గొంది. దీనికి సంబంధించిన ఫొటోలను వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది .
రీల్‌తో అభిమానుల్లో ఉత్సాహం..
అమెరికా వెళ్లిన అనసూయ అక్కడే ఓ రీల్ చేసి తన అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అయితే ఈ రీల్ చేస్తున్నప్పుడు అనసూయ తన నాభి అందాలను నడుము మడతలను క్రాప్ చేసింది. దంతో జనాలు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ‘‘అనసూయ ఆంటీఈ వయసులో నీకు ఇలాంటి పనులు అవసరమా..?’’ అంటుంటే మరికొందరు అది చూపించడానికేగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అంటూ ఇంకొందరు ట్రోల్ చేస్తున్నారు. ‘‘నీ నడుము మడతలు పట్టే చెప్పేయచ్చు నువ్వు ఆంటీ అని’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.