Electoral Bonds: బీజేపీ కి వేల కోట్ల విరాళాలు.. దీన్ని ఎవడూ ప్రశ్నించొద్దు అంతే!

2022లో ఆర్థిక అవకతవకల ఆరోపణల నేపథ్యంలో ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ సంస్థ ఈడీ విచారణ ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో ఈ సంస్థ ఏకంగా 1,368 కోట్లను బాండ్ల రూపంలో చెల్లించడంతో దానిపై విచారణ ఆగిపోయింది.

Written By: Anabothula Bhaskar, Updated On : March 15, 2024 11:03 am

Electoral Bonds

Follow us on

Electoral Bonds: ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా భారతీయ జనతా పార్టీకి వేల కోట్లు.. అవి కూడా విరాళాల రూపంలో.. ఇచ్చింది పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలు.. మేఘా నుంచి మొదలు పెడితే యశోద హాస్పిటల్ వరకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2019 ఏప్రిల్ ఒకటి నుంచి 2024 ఏప్రిల్ 15 వరకు బాండ్లకు సంబంధించిన సమాచారాన్ని ఎన్నికల సంఘానికి సమర్పించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2022లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ ఎదుర్కొన్న ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ సంస్థ ఏకంగా రూ. 1,368 కోట్లను బాండ్ల రూపంలో చెల్లించింది. ఈ చెల్లింపు ద్వారా అగ్రస్థానంలో కొనసాగుతోంది. హైదరాబాద్ నగరానికి చెందిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ 966 కోట్ల విలువైన బాండ్లను రాజకీయ పార్టీల కోసం కొనుగోలు చేసింది. ఈ జాబితాలో అది రెండవ స్థానంలో ఉంది. బాండ్ల రూపంలో అత్యధికంగా నిధులు అందుకున్న రాజకీయ పార్టీలలో బిజెపి అగ్రస్థానంలో ఉంది. ఆ పార్టీకి ఏకంగా 8,633 బాండ్ల రూపంలో రూ. 6,560 కోట్ల నిధులు అందాయి. తృణమూల్ కాంగ్రెస్ 1609 కోట్లతో రెండవ స్థానంలో, కాంగ్రెస్ పార్టీ 3,146 బాండ్లు అందుకొని 1,421 కోట్ల ద్వారా మూడవ స్థానంలో ఉంది. మొత్తం ఎలక్టోరల్ బాండ్లలో 47% బిజెపికి దక్కాయి. కాంగ్రెస్ పార్టీకి 11 శాతం లభించాయి. భారత రాష్ట్ర సమితి నాల్గవ స్థానంలో, వైసిపి, టిడిపి 7, 8 స్థానాల్లో ఉన్నాయి.

విచారణ మాయమైంది

2022లో ఆర్థిక అవకతవకల ఆరోపణల నేపథ్యంలో ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ సంస్థ ఈడీ విచారణ ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో ఈ సంస్థ ఏకంగా 1,368 కోట్లను బాండ్ల రూపంలో చెల్లించడంతో దానిపై విచారణ ఆగిపోయింది. అప్పట్లో ఆర్థిక అవకతలకు పాల్పడిందని.. విచారణ పేరుతో ఈడీ హడావిడి చేసింది. కానీ ఎప్పుడైతే ఈ సంస్థ బాండ్ల రూపంలో డబ్బులు చెల్లించిందో అప్పుడే ఆ కేసు నీరుగారిపోయింది. విచారణ ఆటకెక్కింది. ఇక మేఘా సంస్థ కూడా అంతే.. ఇది 966 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేయడంతో.. దేశంలో పలు కీలకమైన ప్రాజెక్టుల సంబంధించి పనులు దక్కాయని విమర్శలున్నాయి. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రా మాత్రమే కాకుండా దేశంలో అనేక ప్రాంతాల్లో ఈ సంస్థ పలు కీలక పనులు చేస్తోంది..

బాండ్లు ఇచ్చిన కంపెనీలు ఏవంటే

ఫ్యూచర్ గేమింగ్ – 1368 కోట్లు
మేఘా ఇంజనీరింగ్ – 966 కోట్లు
క్విక్ సప్లై చైన్ – 410 కోట్లు
వేదాంత – 400 కోట్లు
హల్దియా ఎనర్జీ – 377 కోట్లు
భారతి టెలికం – 247 కోట్లు
ఎస్ ఫైల్ మైనింగ్ – 254 కోట్లు
వెస్టర్ను యూపీ పవర్ – 200 కోట్లు
కేవెంటల్ ఫుడ్ పార్క్ – 194 కోట్లు
మదన్ లాల్ – 185 కోట్లు
డిఎల్ఎఫ్ – 170 కోట్లు
యశోద హాస్పిటల్స్ -162 కోట్లు
ఉత్కల్ అల్యూమినా -145 కోట్లు
జిందాల్ స్టీల్ -123 కోట్లు
బిర్లా కార్బన్ -105 కోట్లు
రుంగ్టా సన్స్ -100 కోట్లు
రెడ్డి ల్యాబ్స్ – 80 కోట్లు
పిరామల్ -60 కోట్లు
నవయుగ- 55 కోట్లు
షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ – 40 కోట్లు
సిప్లా – 39 కోట్లు
ఇంటర్ గ్లోబ్ స్పైస్ జెట్ – 36 కోట్లు
మిట్టల్ కంపెనీలు – 246 కోట్లు
గ్రాసిం – 33 కోట్లు
జిందాల్ స్టెయిన్లెస్ -30 కోట్లు
బజాజ్ ఆటో – 25 కోట్లు
సన్ ఫార్మా – 25 కోట్లు
మ్యాన్ కైండ్ ఫార్మా – 24 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ – 20 కోట్లు
సుజుకి – 20 కోట్లు
అల్ట్రాటెక్ – 15 కోట్లు
టీవీఎస్ – 10 కోట్లు.. విరాళాలుగా ప్రకటించాయి..

ఇక ఈ విరాళాల్లో భారతీయ జనతా పార్టీకి 47% అంటే 6,560 కోట్లు అందాయి. తృణమూల్ కాంగ్రెస్ కు 1609 కోట్లు అందాయి.. కాంగ్రెస్ పార్టీకి 1,421 కోట్లు అందాయి. భారత రాష్ట్ర సమితికి 1,215 కోట్లు, బీజేడీకి 775 కోట్లు, డీఎంకేకు 639 కోట్లు, వైసిపికి 337 కోట్లు, టిడిపికి 219 కోట్లు, శివసేనకు 159 కోట్లు, ఆర్జేడీ కి 72 కోట్లు, జనసేనకు 21 కోట్లు అందాయి.