Electoral Bonds: రాజకీయ పార్టీలకు కంపెనీల నిధులు.. ఎస్ బీఐ “బాండ్ల” మూతలు!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2019 ఏప్రిల్ ఒకటి నుంచి 2024 ఏప్రిల్ 15 వరకు బాండ్లకు సంబంధించిన సమాచారాన్ని ఎన్నికల సంఘానికి ఇచ్చింది. అంటే దాదాపు 5 సంవత్సరాల కాలానికి సంబంధించిన సమాచారం ఇది.

Written By: Anabothula Bhaskar, Updated On : March 15, 2024 11:07 am

Electoral Bonds

Follow us on

Electoral Bonds: సుప్రీంకోర్టు అనేకసార్లు తలంటిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దిగి వచ్చింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను బయటపెట్టింది. కాకపోతే ఇందులో దాగుడుమూతలు ఆడింది. ఏ కంపెనీ.. రాజకీయ పార్టీకి.. ఏ స్థాయిలో నిధులు ఇచ్చింది.. అనే విషయాలను కనుక్కో లేని విధంగా సమాచారం ఇచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమర్పించిన రెండు జాబితాలను ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా తన వెబ్ సైట్ లో అప్లోడ్ చేసింది. అయితే అందులో ఒక జాబితాలో కంపెనీలు ఎంత విలువైన బాండ్స్ కొన్నాయో వివరాలున్నాయి. మరో జాబితాలో రాజకీయ పార్టీలకు ఎంత విలువైన బాండ్స్ అందాయో వివరాలున్నాయి. అయితే ఈ రెండు జాబితాలో బాండ్ల సీరియల్ నెంబర్స్ ఎస్బిఐ ప్రస్తావించలేదు. ఈ ప్రకారం ఎస్బిఐ నుంచి కంపెనీలు కొనుగోలు చేసిన బాండ్లు ఏ పార్టీకి అందాయో తెలుసుకునే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ” స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించిన జాబితా సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తికి పూర్తి వ్యతిరేకంగా ఉంది. దీనిని ఎలా సమర్థించుకుంటార” ని ప్రఖ్యాత న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు.

తెలుసుకునే బాధ్యత ఓటర్ కు ఉంటుంది.

” ఏ కంపెనీ నుంచి ఏ రాజకీయ పార్టీ లబ్ధి పొందిందో తెలుసుకునేందుకు బాండ్లకు సంబంధించిన సీరియల్ నెంబర్స్ కచ్చితంగా ఉండాలని” ఆయన వ్యాఖ్యానించారు.. లబ్ధిదారులు ఎవరో తెలుసుకోవడానికి జాబితాను ప్రకటించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని.. కానీ దానికి ఎస్బిఐ తిలోదకాలు ఇచ్చిందని ఆయన అన్నారు. ” బాండ్ నెంబర్లు సమాచారం వేరువేరుగా ఉందని ఎస్బిఐ చెబుతోంది. హోటల్ స్వేచ్ఛగా ఓటు వేయాలంటే.. రాజకీయ పార్టీకి ఎక్కడినుంచి డబ్బులు వస్తున్నాయని సమాచారం అతడికి కచ్చితంగా తెలిసి ఉండాలి. ఈ విషయాన్ని స్వయంగా సుప్రీంకోర్టు చెప్పిందని” న్యాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఏదైనా ఒక కంపెనీ విడుదల చేసిన నిధులకు.. ఒక పార్టీకి చెందిన నిధులకు సంబంధం ఉందో, లేదో ధ్రువీకరించుకునేందుకు ఓటర్కు కచ్చితంగా అవకాశం కలగాలి. బాండ్ల సీరియల్ నెంబర్లు కూడా జాబితాలో చెప్పాల్సిందే. వాస్తవానికి సుప్రీంకోర్టు ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు గడువు విధించినప్పుడు అన్ని వివరాలు చెప్పాలని అడిగింది. దానికి కొంచెం సమయం పడుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమాధానం చెప్పింది. కచ్చితంగా చెప్పాల్సిందేనని, గడువు ఇవ్వడం కుదరదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఒత్తిడి మేరకే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 జాబితాలు విడుదల చేసింది. అయితే ఈ వివరాలు పాక్షికమేనని, సీరియల్ నెంబర్లు ఇస్తేనే సంపూర్ణ వివరాలు తెలుస్తాయని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.

ఐదేళ్ల వివరాలు మాత్రమే..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2019 ఏప్రిల్ ఒకటి నుంచి 2024 ఏప్రిల్ 15 వరకు బాండ్లకు సంబంధించిన సమాచారాన్ని ఎన్నికల సంఘానికి ఇచ్చింది. అంటే దాదాపు 5 సంవత్సరాల కాలానికి సంబంధించిన సమాచారం ఇది. దీని ప్రకారం ఆయా కంపెనీలు ఇచ్చిన 22,030 బాండ్లను రాజకీయ పార్టీలు లిక్విడ్ గా మార్చుకున్నాయి. వాటి విలువ దాదాపు 16,518 కోట్లు. ఈ నగదును అన్ని రాజకీయ పార్టీలు భారీగా ఖర్చు చేశాయి. 2022లో ఎన్ ఫోర్స్ మెంట్ విచారణ ఎదుర్కొన్న ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ సంస్థ 1365 కోట్లను బాండ్ల రూపంలో చెల్లించింది. ఈ సంస్థ ఆర్థిక అవకతవకలు ఆరోపణలు ఎదుర్కొంది. ఎప్పుడైతే బాండ్లు చెల్లించిందో.. అప్పుడే ఈ సంస్థపై కేసు నీరుగారిపోయింది.