https://oktelugu.com/

Chandrayaan 3: చంద్రయాన్ -3 ప్రాజెక్టు లో భాగమైన వీళ్ల విద్యార్హతలు ఏంటో తెలుసా?

సోమనాథ్ కేరళకు చెందిన వ్యక్తి. ఎర్నాకుళంలోని మహారాజా కళాశాలలో ఫ్రీ డిగ్రీని కంప్లీట్ చేశారు. ఆ తరువాత కేరళలోని క్విలాన్ TKM ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేట్ డిగ్రీని చదివారు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 29, 2023 4:51 pm
    Chandrayaan 3

    Chandrayaan 3

    Follow us on

    Chandrayaan 3: చంద్రయాన్ -3 గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది. ఇప్పటి వరకు ఏ దేశం చేయలేని ఘనత ఇండియా చేసింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై మొదటిసారి అడుగుపెట్టి రికార్డు నెలకొల్పించింది. మరి ఇంతటి విజయం వెనుక భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తల కృషి ఎంతగానో ఉందని చెప్పుకోవచ్చు. చంద్రయాన్-3 ప్రాజెక్టులో పలువురు శాస్త్రవేత్తలతో పాటు ఇతర టెక్నీషియన్లు తమ శక్తికి మంచి కష్టపడ్డారు. అయితే ఈ బాధ్యత మాత్రం 6గురు శాస్త్రవేత్తలు తమ భుజాన వేసుకొని ముందుకు సాగారు. ఆ ఆరుగురు ఎక్కడెక్కడ విద్యాభ్యాసం చేశారో తెలుసుకుందామా..

    ఎస్. సోమనాథ్:
    సోమనాథ్ కేరళకు చెందిన వ్యక్తి. ఎర్నాకుళంలోని మహారాజా కళాశాలలో ఫ్రీ డిగ్రీని కంప్లీట్ చేశారు. ఆ తరువాత కేరళలోని క్విలాన్ TKM ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేట్ డిగ్రీని చదివారు. ఆ తరువాత కర్ణాటకలోని బెంగుళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఏరోస్పేస్ మాస్టర్ డిగ్రీని డైనమిక్స్ కంట్రోల్ లో నైపుణ్యం సాధించాడు.

    ఎం. శంకరన్:
    శంకరన్ 1986లో కేరళలోని తిరుచిరాపల్లి లోని భారతిదాసన్ విశ్వవిద్యాలయం నుంచి భౌతిక శాస్త్రంలో పీజీ చదివాడు. ఆ తర్వాత URSC అని పిలువబడే ఇస్రోలో డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.

    డాక్టర్ వి. నారాయణన్:
    డాక్టర్ వి నారాయణన్ చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ ఆఫ్ సైన్స్ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఖరగ్ పూర్ ఐఐటీ కళాశాలలో ఎంటెక్ పూర్తి చేశాడు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో పీహెచ్ డీ చేసిన ఆయన రజతం పతకం సాధించాడు.

    డాక్టర్ ఎస్.ఉన్నికృష్ణన్ నాయర్:
    ఈయన కేరళ విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో బీటెక్, IISc బెంగళూరు నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో ఎంఈ, మద్రాసు ఐఐటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో పీహెచ్ డీ చేశారు. నల్సార్ యూనివర్సిటీ నుంచి టెలీ కమ్యూనికేషన్, స్పేస్ లా లో ఎంఏ చేశారు.

    పి. వీరముత్తు వేల్:
    వీరముత్తు వేల్ విల్లుపురం లో రైల్వే స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఆ తరువాత ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా పూర్తి చేశాడు. చెన్నైలోని ఓ ప్రైవేటు కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్, ఇంజనీరింగ్ కళాశాలలో పీజీ పూర్తి చేశాడు. మద్రాసు ఐఐటీ నుంచి పీహెచ్ డీ పట్టా పొందారు.

    కల్పన కాళహస్తి:
    కల్పన కాళహస్తి కర్ణాటకలోని బెంగుళూరులో జన్మించారు. ఈమె ఖరగ్ పూర్ ఐఐటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో పట్టా పొందారు. అలాగే మద్రాసు యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో బీటెక్ చదివారు.