https://oktelugu.com/

ఆ వ్యాక్సిన్లకు జెట్‌ స్పీడ్‌లో పర్మిషన్‌..: వారంలోనే వ్యాక్సినేషన్‌

ఏడాది కాలం పాటు కరోనాతో కష్టాలు అనుభవించారు ప్రజలు. టీకా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూశారు. అప్పటి నుంచి శాస్త్రవేత్తలు కూడా టీకా కోసం అహర్నిషలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఒక్కో కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్‌కు అనుమతులు లభిస్తూనే ఉన్నాయి. అయితే.. తాజాగా.. ఔషధ నియంత్రణ సంస్థ మరో రెండు వ్యాక్సిన్లకు పర్మిషన్‌ ఇచ్చింది. అంచనాలకు మించిన వేగంతో వాటికి అనుమతులిచ్చింది. రోజు వ్యవధిలోనే అనుమతి ఇచ్చేస్తూ నిర్ణయం తీసుకోవటం విశేషం. Also […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 3, 2021 / 04:30 PM IST
    Follow us on


    ఏడాది కాలం పాటు కరోనాతో కష్టాలు అనుభవించారు ప్రజలు. టీకా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూశారు. అప్పటి నుంచి శాస్త్రవేత్తలు కూడా టీకా కోసం అహర్నిషలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఒక్కో కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్‌కు అనుమతులు లభిస్తూనే ఉన్నాయి. అయితే.. తాజాగా.. ఔషధ నియంత్రణ సంస్థ మరో రెండు వ్యాక్సిన్లకు పర్మిషన్‌ ఇచ్చింది. అంచనాలకు మించిన వేగంతో వాటికి అనుమతులిచ్చింది. రోజు వ్యవధిలోనే అనుమతి ఇచ్చేస్తూ నిర్ణయం తీసుకోవటం విశేషం.

    Also Read: రేప్ చేసి చంపుతాడు! శవాలతో పైశాచికం.. వంద మందిని.. సైకోకిల్లర్ కథ!

    ఇప్పటికే సీరమ్ సంస్థ రూపొందించిన (ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనెకా) వ్యాక్సిన్‌తోపాటు.. హైదరాబాద్ సంస్థ భారత్ బయోటెక్ రూపొందించిన (ఐసీఎంఆర్.. పుణె ఎన్ఐవీ సహకారంతో) టీకాలకు ఆమోదముద్ర పడింది. దీంతో ఈ టీకాల్ని అత్యవసర అనుమతులకు అందరికీ వినియోగించుకునే అవకాశం లభించినట్లైంది. ఈ ఆదివారం ఈ రెండు టీకాలకు ఆమోదం లభించింది.

    మరోవైపు.. కొత్త వైరస్ కూడా అంతకంతకూ విస్తరించే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావటం గమనార్హం. ఈ నేపథ్యంలో మరో వారంలో వ్యాక్సిన్ అందుబాటులోకి రావటంతోపాటు.. దేశ వ్యాప్తంగా తొలిదశ వ్యాక్సినేషన్ కార్యక్రమం షురూ కానుంది.

    Also Read: ఇగ్లూ ఇల్లు.. మజాగుండు.. చలికాలంలో చూడాల్సిన మన ప్రదేశాలు

    సీరం ఇనిస్టిట్యూట్ తయారు చేసిన వ్యాక్సిన్‌ను.. కోవిషీల్డ్‌గా వ్యవహరిస్తుంటే.. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ను కోవాగ్జిన్ గా వ్యవహరిస్తున్నారు. రెండు వ్యాక్సిన్లకు అనుమతి లభించటంపై అటు ప్రధాని మోడీ కూడా స్పందించారు. తాజాగా వచ్చిన అనుమతులతో భారత్ ఆరోగ్యవంతమైన కోవిడ్ రహిత దేశంగా మార్చేందుకు సహకరిస్తుందన్నారు. అనుమతులు వచ్చిన రెండు వ్యాక్సిన్లు భారత్‌లోనే తయారు కావటం గర్వకారణమన్న ప్రధాని.. కోవిడ్ పై యుద్ధం కీలక మలుపు తిరిగిందన్నారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్