‘వీహెచ్’ కథ వేరేలా ఉందిగా..!

కాంగ్రెస్ లో సీనియర్ నేతగా వీహెచ్ హన్మంతరావు కొనసాగుతున్నారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నానని పదేపదే చెప్పుకునే వీహెచ్ హన్మంతరావు వ్యవహరశైలి కొద్దిరోజులుగా రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. Also Read: కేటీఆర్‌‌ సీఎం.. అదంతా కేసీఆర్‌‌ పాలి‘ట్రిక్స్‌ టీపీసీసీ రేసులో తాను కూడా ఉన్నానని వీహెచ్ గతంలోనే ప్రకటించారు. టీపీసీసీ చీఫ్ పదవీ బీసీలకు కేటాయించాలని అధిష్టానాన్ని కొంతకాలంగా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అగ్రవర్ణాలను టార్గెట్ చేస్తూ వీహెచ్ […]

Written By: Neelambaram, Updated On : January 3, 2021 7:32 pm
Follow us on


కాంగ్రెస్ లో సీనియర్ నేతగా వీహెచ్ హన్మంతరావు కొనసాగుతున్నారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నానని పదేపదే చెప్పుకునే వీహెచ్ హన్మంతరావు వ్యవహరశైలి కొద్దిరోజులుగా రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.

Also Read: కేటీఆర్‌‌ సీఎం.. అదంతా కేసీఆర్‌‌ పాలి‘ట్రిక్స్‌

టీపీసీసీ రేసులో తాను కూడా ఉన్నానని వీహెచ్ గతంలోనే ప్రకటించారు. టీపీసీసీ చీఫ్ పదవీ బీసీలకు కేటాయించాలని అధిష్టానాన్ని కొంతకాలంగా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అగ్రవర్ణాలను టార్గెట్ చేస్తూ వీహెచ్ మాటలయుద్ధానికి దిగారు.

కాంగ్రెస్ లోని ఒకటి రెండు శాతంగా ఉన్న అగ్రవర్ణాల వారి వల్లే కాంగ్రెస్ నాశనమవుతుందని ఇటీవల వ్యాఖ్యనించారు. దీంతోపాటు రేవంత్ రెడ్డికి పీసీసీ ఇస్తే తాను కాంగ్రెస్ ను వీడుతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ విషయంపై ఆయనకు అధిష్టానం షోకాజ్ నోటీసు జారీ చేయగా తిరిగి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. అలాగే ఇటీవల ఏపీలో దివంగత నేత వంగవీటి రాధా విగ్రహావిష్కరణకు వెళ్లిన వీహెచ్ జనసేన అధినేత పవన్ పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఏపీలో వంగవీటి రాధా తర్వాత అంతటి క్రేజ్ పవన్ కల్యాణ్ కే ఉందని కామెంట్ చేశాడు. పవన్ కల్యాణ్ కాంగ్రెస్ లోకి వస్తే పీసీసీ ఇప్పిస్తానంటూ వీహెచ్ కామెంట్ చేశాడు. దీనిపై కాంగ్రెస్ లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

Also Read: టీచర్లను కేసీఆర్‌‌ అందుకే దూరం పెడుతున్నారా..?

ఆదివారం హైదరాబాద్లోని లోయర్ ట్యాంక్ బండ్ లో జరిగిన మున్నూరుకాపు మహాసభలో వీహెచ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై వీహెచ్ ప్రశంసలవర్షం కురిపించడం హాట్ టాపిక్ గా మారింది.

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అన్ని కులాలను ప్రోత్సహిస్తుందని తెలిపారు. అంతేకాకుండా భవన నిర్మాణాల కోసం రూ.5కోట్ల నిధులు అందిస్తున్నారని సీఎం కేసీఆర్ ను ఆకాశానికెత్తారు.

గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా సీఎం కేసీఆర్ లా కుల సంఘాలకు ఇంత ప్రాధాన్యం ఇవ్వలేదని తెలిపారు. కాగా పీసీసీ విషయంలో కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పిస్తున్న వీహెచ్ సడెన్ గా కేసీఆర్ పొగడటం వెనుక కథే వేరేగా ఉందనే టాక్ విన్పిస్తోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్