Dailyhunt AIG StoryForGlory : దేశంలోనే నంబర్ 1 పాపులర్ న్యూస్ యాప్ ‘డైలీహంట్’ తాజాగా ఏఏంజీ నెట్ వర్క్స్ లిమిటెడ్ తో కలిసి నిర్వహించి టాలెంట్ హంట్ దిగ్విజయంగా ముగిసింది. ఆదానీ గ్రూప్ మద్దతు ఉన్న ఈ ఏఎంజీ లిమిటెడ్ కంపెనీ తాజాగా డైలీ హంట్ తో కలిసి భారతదేశపు తదుపరి కథకుల #StoryForGlory పేరిట దేశవ్యాప్తంగా ఈ టాలెంట్ హంట్ ప్రారంభించింది. దీనికి సంబంధించిన గ్రాండ్ ఫైనల్ కార్యక్రమం ఢిల్లీలో జరిగింది.

వీడియో, ప్రింట్ అనే రెండు కేటగిరీల కింద 12 మంది విజేతలను ఎంపిక చేయడం ద్వారా దేశవ్యాప్తంగా టాలెంట్ హంట్ నిర్వహించారు. ఈ ఏడాది మేనెలలో ప్రారంభమైన నాలుగు నెలల నిడివి ఉన్న ఈ కార్యక్రమం కోసం 1000కిపైగా దరఖాస్తులు వచ్చాయి. వీరిలో 20 మంది ప్రతిభావంతులను షార్ట్ లిస్ట్ చేశారు. ఈ అభ్యర్థులకు ప్రముఖ మీడియా సంస్థ ‘ఎంఐసీఏ’లో 8 వారాలాపాటు ఫెలోషిప్, రెండు వారాల లెర్నింగ్ ప్రోగ్రామ్ ను అందించారు.
కఠినమైన శిక్షణ తర్వాత ఆరువారాల పాటు తమ చివరి ప్రాజెక్టులో పనిచేశారు. ప్రముఖ మీడియా పబ్లిషింగ్ సంస్థల సూచనలు అందుకున్నారు. ప్రోగ్రామ్ సమయంలో వారి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం.. కథనాన్ని, కంటెంట్ ను వివరించడాన్ని మెరుగుపరిచే విధానంపై దృష్టి పెట్టారు. ముగింపులో 20 మంది ఫైనలిస్టులు తమ ప్రాజెక్టులను సమర్పించారు. అందులో 12 మందిని విజేతలుగా ఎంపిక చేశారు.
జ్యూరీలో డైలీ హంట్ వ్యవస్థాపకుడు వీరేంద్ర గుప్తా, ఏఎంజీ మీడియా నెట్ వర్క్స్ లిమిటెడ్ సీఈవో కం ఎడిటర్ సంజయ్ పుగాలియా , ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ గోయెంకా, ఫిల్మ్ కంపానియన్ అనుపమ చోప్రా, షీది పిపుల్ ఫౌండర్ శైలీ చోప్రా, గావ్ కనెక్షన్ వ్యవస్థాపకుడు నిలీష్ మిశ్రా, ఫ్యాక్టర్ డైలీ కో ఫౌండర్ పంకజ్ మివ్రాలు ‘స్టోరీఫర్ గ్లోరీ’ కార్యక్రమం సందర్భంగా ప్రజల మనోభవాలను గుర్తించారు. జర్నలిజంలో వారి స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంతోపాటు సృజనాత్మక కంటెంట్ తో మీడియా ఎకో సిస్టమ్ ను రూపొందించడానికి అవకాశాన్ని అందించింది.
ఈ సందర్భంగా డైలీ హంట్ వ్యవస్థాపకుడు వీరేంద్ర గుప్తా మాట్లాడుతూ.. భారతదేశంలోని కథకులలో శక్తివంతమైన, ప్రతిభావంతమైన వారిని కనుగొనేందుకు తాము సాంకేతికతను ఉపయోగిస్తున్నామన్నారు. డిజిటల్ న్యూస్, మీడియా స్పేస్ గణనీయంగా పురోగమిస్తోందని.. స్టోరీ ఫర్ గ్లోరీ కార్యక్మరం ద్వారా భారత్ లోని మీడియా ఎకోస్టిస్టమ్ ను రూపొందించడంలో నిబద్దతను చాటుకున్నామని వీరేంద్ర అన్నారు. భారతదేశంలోని వర్ధమాన కథకులు వారి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి, అభిరుచులను పంచుకోవడానికి అవకాశం కల్పిస్తామన్నారు.
ఏఎంజీ మీడియా నెట్ వర్క్స్ లిమిటెడ్ సీఈవో , ఎడిటర్ ఇన్ చీఫ్ సంజయ్ పుగాలియా మాట్లాడుతూ.. కథల భూమిగా భారత్ నిలిచిందని.. చాలా మంది కథకులు ఇక్కడ ఉన్నారన్నారు. డైలీహంట్ తో కలిసి తాము తర్వాతి తరం భారత చరిత్రకారులను గుర్తించగలిగామన్నారు. వారికి అవసరమైన మద్దతు, వేదికను అందించగలమన్నారు. భారత్ లోకి క్రియేటర్స్ కు స్టోరీ ఫర్ గ్లోరీ జీవం పోసిందన్నారు.
-స్టోరీ ఫర్ గ్లోరీ నేపథ్యం ఇదీ..
#StoryForGlory అనేది వీడియో, రాతపూర్వక ఫార్మాట్ లలో కరెంట్ ఎఫైర్స్, న్యూస్, సైన్స్, టెక్నాలజీ కళలు, సంస్కృతి తదితర అంశాలపై భారత్ లో కంటెంట్ సృష్టికర్తలను కనుగొనే లక్ష్యంతో ప్రారంభించబడింది. డైలీహంట్ భారత్ లోని 15 భాషల్లో 1 మిలియన్ కు పైగా కొత్త తరహా కంటెంట్ లను అందిస్తోంది. డైలీహంట్ లో 50వేలకు పైగా కంటెంట్ పార్ట్ నర్స్ పనిచేస్తున్నారు. భారతీయులకు వినోదాన్ని అందించే కంటెంట్ ను కనుగొనడం.. తెలియజేయడం డైలీహంట్ లక్ష్యం.
డైలీహంట్ దేశంలోనే ప్రముఖ పెద్దదైన న్యూస్ యాప్. దీనిలో ప్రతీనెల 350 మిలియన్ల మంది యాక్టివ్ వినియోగదారులకు సేవలందిస్తోంది. రోజుకు ఒక యాక్టివ్ యూజర్ డైలీహంట్ లో 30 నిమిషాలు బ్రౌజ్ చేస్తాడు. డైలీహంట్ యాప్ ఆండ్రాయిడ్, ఐవోఎస్, మొబైల్ యాప్ లలో అందుబాటులో ఉంది.