https://oktelugu.com/

Third Wave: తాజా నివేదిక: ఇంకో మూడు వారాలే.. దేశంలో కరోనా విస్ఫోటనం?

అన్నట్టే జరుగుతోంది.. కరోనా కల్లోలానికి రంగం సిద్ధమవుతోంది. మొదటి వేవ్ నుంచి తప్పించుకున్న భారతదేశానికి రెండో వేవ్ ఎంత వినాశనాన్ని చూపించిందో చూశాం.. ఇప్పుడు మూడో ముప్పు ముంగిట పొంచి ఉన్నాం. తాజాగా అంచనాలన్నీ నిజం అవుతున్నాయి. దేశంలో రాష్ట్రంలో కేసులు జెట్ స్పీడులా దూసుకెళుతున్నాయి. భారత్ లో కోవిడ్ మూడోదశ వ్యాప్తి మరో మూడు వారాల్లో గరిష్ట్ర స్థాయికి చేరుతుందని తేలింది. తాజాగా ఎస్.బీఐ చేసిన పరిశోధనలో ఈ అంచనావేసింది. నెలరోజుల నుంచి మనదేశంలో కరోనా […]

Written By:
  • NARESH
  • , Updated On : January 19, 2022 11:43 am
    Follow us on

    అన్నట్టే జరుగుతోంది.. కరోనా కల్లోలానికి రంగం సిద్ధమవుతోంది. మొదటి వేవ్ నుంచి తప్పించుకున్న భారతదేశానికి రెండో వేవ్ ఎంత వినాశనాన్ని చూపించిందో చూశాం.. ఇప్పుడు మూడో ముప్పు ముంగిట పొంచి ఉన్నాం. తాజాగా అంచనాలన్నీ నిజం అవుతున్నాయి. దేశంలో రాష్ట్రంలో కేసులు జెట్ స్పీడులా దూసుకెళుతున్నాయి.

    భారత్ లో కోవిడ్ మూడోదశ వ్యాప్తి మరో మూడు వారాల్లో గరిష్ట్ర స్థాయికి చేరుతుందని తేలింది. తాజాగా ఎస్.బీఐ చేసిన పరిశోధనలో ఈ అంచనావేసింది. నెలరోజుల నుంచి మనదేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ వేగంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. నగరాలతో మొదలై ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలను సైతం ఈ వ్యాధి చుట్టేస్తోంది. ఈ తీవ్రత ఎక్కువ కాలం ఉండకపోవచ్చని.. వచ్చే మూడు వారాల్లో కేసుల సంఖ్య గరిష్ట్ర స్థాయికి చేరుకోవచ్చన్నది ఎస్.బీఐ తాజా అంచనా..

    మొదటి రెండో వేవ్ తోపాటు అమెరికా సహా యూఏఈ, చిలీ, సింగపూర్, చైనా తదితర దేశాల్లో పరిశోధించిన ఎస్బీఐ భారత్ లో థర్డ్ వేవ్ అంచనాలు రూపొందించింది. ముంబైలో ఈనెల 7న 20971 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ సీజన్ లో ఇదే గరిష్ట స్థాయి. ముంబైలో కేసుల సంఖ్య గరిష్టానికి చేరిన 2-3 వారాల్లో జాతీయ గరిష్ట స్థాయి నమోదయ్యే అవకాశం ఉందని ఎస్బీఐ నివేదికలో పేర్కొంది.

    ఇతర దేశాల్లో గరిష్టస్థాయి నమోదు కావడానికి సగటున 54 రోజుల సమయం పట్టింది. మనదేశంలో కేసుల సంఖ్య పెరగడం డిసెంబర్ 29 నుంచి మొదలైంది. ఈనెల 17న 2.38 లక్షల కొత్త కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 16.56 లక్షలకు పెరిగింది.

    భారతదేశంలో ఇప్పటికే 64 శాతం జనాభాకు ఇప్పటికే 2 డోసుల టీకా వేయడం పూర్తయ్యింది. టీకాలు తీసుకున్న ప్రజల్లో గ్రామీణులు 83శాతం ఉన్నారు. అందువల్ల చాలా వరకూ ప్రజలకు టీకాతో భద్రత కలిగినట్లు అవుతోంది.

    ప్రస్తుతం దేశంలోనే ఆంధ్రప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఒడిశా, జమ్మూకశ్మర్, అరుణాచల్ ప్రదేశ్ లలో కేసుల సంఖ్య అధికంగా ఉంది. కానీ రెండేవేవ్ లో చేరినంతగా జనాలు ఆస్పత్రి పాలవ్వకపోవడం ఊరటగా చెప్పొచ్చు.